మంచు మనోజ్( Manoj Manchu ) హీరోగా పరిచయం అయినా ఝుమ్మంది నాదం సినిమా( Jhummandi Naadam movie )తో ముద్దుగుమ్మ తాప్సి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.హీరోయిన్గా తాప్సికి అది మొదటి సినిమానే అయినా కూడా మంచి గుర్తింపు లభించింది.
సొట్ట బుగ్గల సుందరి అంటూ ప్రేక్షకులు తాప్సి ని ఆదరించారు.తెలుగు లో స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.
కానీ దురదృష్టవశాత్తు ఆమెకు మంచి సక్సెస్ దక్కలేదు.తెలుగు లో స్టార్ హీరోయిన్ హోదా లభించక పోవడంతో బాలీవుడ్ కి వలస వెళ్లింది.

అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది.మంచి ఆఫర్స్ హిందీ ఇండస్ట్రీ( Bollywood ) నుండి దక్కించుకుంటున్న తాప్సి( tapsee ) తెలుగు లో మాత్రం అవకాశాలు లేక పోవడంతో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది.తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మళ్ళీ వచ్చే ఆలోచన లేక పోవడం వల్లనో ఏమో కానీ ఇష్టానుసారంగా తెలుగు సినిమా పరిశ్రమ గురించి విమర్శలు చేస్తోంది.

తన కెరియర్ ఆరంభంలో చాలా మంది తనను దురదృష్టవంతురాలు అంటూ విమర్శించారని.తాను చేసిన సినిమాలు సక్సెస్ కాక పోవడంతో ఆ నిందలు తనపై వేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుండి రాలేదని.
అందుకే కెరియర్ ఆరంభంలో సినిమాల ఎంపిక విషయంలో తాను సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయానని ఒప్పుకుంది.కానీ ఆ సమయంలో తనను చాలా విమర్శించారని.
నేను నటించడం వల్ల సినిమా లు ఫెయిల్ అయ్యిందన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ని బ్లేమ్ చేయడం ఎక్కువగా ఉంటుందని ఆరోపించింది.
ఎలాగో టాలీవుడ్ లో మళ్లీ నటించాలనే ఆసక్తిని ఆమె చూపించడం లేదు… అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఇలాంటి విమర్శలు చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇన్నాళ్లు తన మనసులో పెట్టుకున్న ఇండస్ట్రీపై కోపాన్ని ఇప్పుడు బయటకి చూపిస్తుందంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







