అప్పుడు సమంతకు ఇప్పుడు మృణాల్ కి సర్‌ ప్రైజ్‌.. మరి శ్రీవల్లి పరిస్థితి ఏంటి?

ఖుషి( Khushi ) సినిమా షూటింగ్ లో ఉన్న సమయం లో సమంత పుట్టిన రోజు రావడంతో హీరో విజయ్ దేవరకొండ చాలా సర్ప్రైసింగ్ గా ఆమె బర్త్‌ డేనే నిర్వహించిన విషయం తెలిసిందే.అర్ధరాత్రి సమయంలో సమంత తో కేక్ కట్ చేయించిన విజయ్ దేవరకొండ.

 Vijay Devarakonda Celebrate Mrunal Thakur Birthday In Sets , Vijay Devarakonda ,-TeluguStop.com

ఒక ఫేక్ షూటింగ్ షాట్ ని కూడా ప్లాన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.మొత్తానికి సమంత పుట్టిన రోజును చాలా విభిన్నంగా జీవితంలో ఎప్పుడు మర్చి పోలేని విధంగా జరిపిన విజయ్ దేవరకొండ తాజాగా మృనాల్ ఠాకూర్( Mrinal Thakur ) యొక్క పుట్టిన రోజు కూడా అదే విధంగా జరిపి చిత్ర యూనిట్స్ సభ్యులందరినీ మరియు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసాడు.

ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాలో హీరోయిన్ గా మృనాల్ నటిస్తోంది.

Telugu Kushi, Mrunal Thakur, Parashuram, Samantha-Movie

వీరిద్దరి మధ్య షూటింగ్స్ సందర్భంగా మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట.అందుకే ఆమె పుట్టిన రోజును చాలా విభిన్నంగా జరిపాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.సమంత మరియు మృనాల్ పుట్టిన రోజులను వైభవంగా జరిపిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తన ప్రియురాలు రష్మిక మందన పుట్టిన రోజును ఎలా చేస్తాడు.ఇంతకు ముందు ఎలా చేశాడో అనేది అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న.

వారు ఒప్పుకున్న ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ప్రేమలో ఉన్నారు అంటూ బలంగా ప్రచారం జరుగుతుంది.అందుకే విజయ్ దేవరకొండ రష్మిక మందన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే వీళ్లిద్దరు కలిసి మరో సారి నటించేందుకు రెడీ అవుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం అందుకోసం ఒక మంచి స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుందని సమాచారం అందుతుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే తప్పకుండా అది మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube