యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) జోరు మీద ఉన్నాడు.ఇప్పటికే ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇదే ఏడాది సలార్ 1 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక కల్కి 2898 AD ( Kalki 2898 AD )సినిమా తో వచ్చే సంవత్సరం ప్రారంభం లో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే.వచ్చే సంవత్సరంలోనే సలార్ రెండవ భాగం కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.
అంతే కాకుండా మారుతి దర్శకత్వం లో ప్రభాస్ చేస్తున్న సినిమా కూడా 2024 సంవత్సరం లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.

ఇలాంటి సమయం లో ప్రభాస్( Prabhas ) కొత్త సినిమా లకు ఓకే చెప్పడం అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తుతుంది.ఒక వైపు మూడు నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి.ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు కమిటై ఉన్నాడు.
ఇలాంటి సమయం లో మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వారికి ఒక సినిమా ను చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.అంతే కాకుండా ఈ సంవత్సరంలోనే ఆ సినిమా కోసం డేట్ లు ఇస్తానంటూ ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ వారికి హామీ ఇచ్చారని తెలుస్తోంది.రూ.100 కోట్ల కు పైగా వారితోషికం ఇస్తున్నందున ప్రభాస్ ఏ ఒక్క సినిమా ను కాదనుకోలేక పోతున్నాడు.అయితే ఈ క్రమంలో ఆయన సినిమాల క్వాంటిటీ పెరుగుతుంది కానీ క్వాలిటీ పెరగడం లేదని అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సలార్ మరియు కల్కి సినిమాలు సక్సెస్ అయితే ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసినా అభిమానులు ఆనందంగా స్వీకరిస్తారు.
కానీ సినిమాలు ఎక్కువ చేస్తూ ఫలితాలు తక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా అభిమానులు కూడా విమర్శలు చేసే అవకాశాలు లేకపోలేదు.వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన ప్రభాస్ రాబోయే సినిమాలతో అయినా సక్సెస్ లను అందుకుంటాడేమో చూడాలి.







