మరో మూడు నెలల్లో తెలంగాణ లో ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతుండడం తో రాజకీయ సమీకరణాలు శరవేగంగా కదులుతున్నాయి.ముఖ్యంగా తమకు అనుకూలంగా అనేక వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి .
ఆర్టీసీ ఉద్యోగులను( TSRTC ) ప్రభుత్వంలో కలపాలని కేసీఆర్( CM KCR ) తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది .ఇదే ఆర్టీసీ ఉద్యోగులు తమను ప్రభుత్వంలో కలపాలని , జీతాలు పెంచాలని దాదాపు మూడు నెలలపాటు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తే కనీసం పట్టించుకోకుండా ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించిన ఈ ప్రభుత్వం ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించడం వెనక ఉద్యోగుల వోట్లపై ప్రేమే కానీ భవిష్యత్తుపై చిత్తశుద్ధి కానీ వారి కుటుంబాలపై ప్రేమగాని లేదని కేవలం ఎన్నికల ప్రయోజనం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.

నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అక్కర ఉండి అప్పుడు వెనుకడుగు వేశారు అనుకుంటే మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రతిపక్షాలు నిలదీయడం గమనార్హం.అంతేకాకుండా తమను రెగ్యులర్ చేయాలంటూ కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ధర్నాలు చేసినప్పుడు కనీసం పట్టించుకోని ఈ ప్రభుత్వం ఇప్పుడు వారి ఓట్ బ్యాంక్ లా ( Vote Bank ) చూసి తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్మొద్దు అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

కెసిఆర్ పరిపాలనలో అనేక వర్గాలు వెనుకబాటుకు, కుంగుబాటుకు గురయ్యాయని తమకు నచ్చిన వర్గాలను పైకి తీయడం నచ్చని వారిని ఎంత ఆందోళన చేసిన పట్టించుకోకపోవడం కేసీఆర్ నైజమని, ఇది ప్రజాస్వామ్య పరిపాలనలా లేదని, దొరల ప్రభుత్వంలా ఉందంటూ కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) విమర్శిస్తున్నారు.కెసిఆర్ తనని తాను నియంతగా భావిస్తారని అందుకే నిర్ణయాలని ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఏక వ్యక్తి పాలనలా ఉంటాయని.ఇలాంటి గడీ ల పాలన తెలంగాణకు అవసరం లేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.అయితే వేల మందితో ముడిపడిన వ్యవస్థ పై కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మాత్రం రాజకీయంగా బారాసకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.







