తెలంగాణ పూసల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్ర కోలా వెంకటేశం( Mudra Kola Venkatesham ) 5,000 రాష్ట్ర తెలంగాణ పూసల సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య 8,000 ఆర్థీక సహాయం అందజేత.రాజన్న సిరిసిల్ల జిల్లా: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెనీ గోపీ ని సోమవారం తెలంగాణ పూసల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్ర కోలా వెంకటేశం,రాష్ట్ర తెలంగాణ పూసల సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య లు పరామర్శించారు.ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని వారు గోపి ని అడిగి తెలుసుకున్నారు.తేదీ 23-0 7 -2023 రోజున కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి వద్ద టాటా ఏసీ కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డిపేట వాస్తవ్యులు పూసల కులానికి చెందిన చేనీ గోపికి రెండు కాళ్లు , చేతు ఫ్యాక్చర్ కాగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న పూసల సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలంగాణ పూసల సంఘం మాజీ రాజన్న సిరిసిల్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్మద్దివేని లక్ష్మణ్ 2000 , రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దివేణి శ్రీధర్ 2000 ,గుడ్ల దేవరాజ్ లకు 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు చేశారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు నాగిశెట్టి నారాయణ,గొల్లపల్లి సంఘ అధ్యక్షులు మద్దివేని కృష్ణ , గుడ్ల శ్రీనివాస్,మద్దివేని కన్నయ్య పాల్గొని ఆర్థిక సహాయం అందజేసి పరామర్శించారు.
ఆశ్వీణీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి ని ఈ సందర్భంగా గుడ్ల సమ్మయ్య, పొదిలా వెంకటరమణ లు కలిసి బిల్లు తగ్గించాలని కోరగా వెంటనే స్పందించి బిల్లు తగ్గించారని అందుకు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి కి సహకరించిన వారందరికీ వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు







