టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ శ్రియ శరన్( Shriya Saran ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లోనే కాకుండా ఇప్పుడు కూడా కుర్రాళ్ళ మదిలో క్రష్ గా ఉంది.
నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులు సంపాదించుకుంది.అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించింది.

ఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ( Telugu Film Industry )కి అడుగుపెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమాతోనే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆ తర్వాత వరుసగా ఠాగూర్( Tagore ), నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.
మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ( Andrei Koscheev ) అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇక తమకు ఒక పాప పుట్టగా ఆ విషయాన్ని చాలా రోజుల వరకు బయట పెట్టలేదు శ్రియ.

ఆ తర్వాత తానే ఆ విషయాన్ని తెలిసి అందరికి షాక్ ఇచ్చింది.ఇక కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ తో సహాయ పాత్రల్లో చేస్తుంది.ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.
తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.

లేటు వయసులో కూడా శ్రియ అందాలు ఏ మాత్రం కూడా తగ్గలేదు.ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అయితే తన భర్తతో ఈమె చేసే అతి మామూలుగా ఉండదు.ప్రైవేట్ ప్లేస్ లోనే కాకుండా పబ్లిక్ ప్లేస్ లలో కూడా తన భర్తకి లిప్ కిస్( Shriya Saran Andrei Koscheev Lipkiss ) ఇస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా కొన్ని ఫొటోస్ పంచుకోగా అందులో కూడా తన భర్తకు లిప్ కిస్ ఇస్తూ కనిపించింది.ఇక ఆ ఫోటోలు చూసి జనాలు తెగ ఫైర్ అవుతున్నారు.
ఏదైనా ఉంటే ప్రైవేట్ ప్లేస్ లో చూసుకోవాలి కానీ ఇలా పబ్లిక్ పేస్ లో చేసి సమాజాన్ని పాడు చేస్తున్నారు అంటూ.నెక్స్ట్ జనరేషన్ కు ఇటువంటివి నేర్పిస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.







