మిరపలో ఆకు మాడు తెగులును నివారించే పద్ధతులు..!

మిరప పంట( chilli crop )ను ఆశించే ఆకు మాడు తెగులు ఒక ఫంగస్ వల్ల సోకుతుంది.ఈ ఫంగస్ పంట అవశేషాలపై చాలా రోజుల వరకు జీవించి ఉంటుంది.

 Methods To Prevent Leaf Moth In Chili , Leaf Moth , Chilli Crop , Farmers , Agr-TeluguStop.com

మొక్క యొక్క ఆకులు నేలను తాకి కలుషితం అయితే ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంది.వాతావరణం లో ఉష్ణోగ్రత 24 నుండి 29 డిగ్రీల మధ్య ఉంటే,భూమి లో అధిక తేమ ఉంటే ఈ ఫంగస్ త్వరగా వృద్ధి చెందుతుంది.

గాలి, వర్షం ద్వారా కూడా ఈ ఫంగస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది.

మిరప యొక్క ముదురు ఆకులు, కాండం, లేతమిరపకాయలపై ఈ తెగుళ్ళ లక్షణాలను గమనించవచ్చు.మిరప ఆకులపై బూడిద రంగునుండి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.మధ్య భాగంలో బుల్స్ ఐ రూపంలో మచ్చలు ఏర్పడతాయి.

ఈ మచ్చల చుట్టూ కాంతివంతమైన పసుపు వలయాలు ఏర్పడతాయి.తర్వాత మొక్కల యొక్క ఆకులు చాలా వరకు రాలిపోయే అవకాశం ఉంటుంది.

మిరప పంట నుండి ఈ తెగులను అరికట్టాలంటే.తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి.పొలంలో డ్రైనేజీ సదుపాయం మెరుగ్గా ఉండేటట్లు చూసుకోవాలి.గాలి వీచే దశను బట్టి మొక్కల వరుసలను నాటుకోవాలి.మొక్కల మధ్య, సాల్ల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఆకులకు తడి తగలకుండా డ్రిప్ విధానం( Drip method )లో నీటిని అందించాలి.

పంటకు రాత్రి సమయాలలో కాకుండా పగలు పూట మాత్రమే నీటిని అందించాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నివారించాలి.

సేంద్రీయ పద్ధతి( Organic method )లో ఈ తెగులను అరికట్టాలంటే బాసిల్లస్ సబ్టిలిస్ లేదా ఆధారిత శీలింద్ర నాశకాలను ఉపయోగించాలి.రసాయన పద్ధతిలో ఈ తెగుళ్లను అరికట్టాలంటే.

ఫెనామిడోన్,( Fenamidone ) మానేబ్, మాంకోజెబ్, క్లోరోతలోనిల్ లలో ఏదో ఒక రసాయన పిచికారి మందును ఉపయోగించి తొలి దశలోనే ఈ తెగులను అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube