ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌లు, కార్లు వస్తున్నాయి.గత నెల వ్యవధిలో వాహనప్రియులను బాగా ఆకట్టుకునే కార్లు, బైక్‌లు విడుదల అయ్యాయి.
వీటికి సంబంధించిన ధర, వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.ముందుగా కార్ల విషయానికి వస్తే హ్యుందాయ్ ఎక్స్‌టర్( Hyundai Extr ) జూలై 10న భారతదేశంలో ప్రారంభించబడింది.
ఇది మల్టీ సింగిల్-టోన్, డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో ఏడు ట్రిమ్ స్థాయిలలో అందించబడుతోంది.హ్యుందాయ్ ఎక్స్‌టర్ 82బిహెచ్‌పి/113ఎన్ఎమ్( Exter 82bhp/113Nm ) ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది.

ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఐదు-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్‌తో పొందవచ్చు.68బీహెచ్‌పీ/95ఎన్ఎం ఉత్పత్తి చేసే సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది.అది కూడా ఐదు-స్పీడ్ మాన్యువల్‌తో వస్తుంది.క్లెయిమ్ చేయబడిన మైలేజ్ పరిశీలిస్తే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అయితే లీటర్ పెట్రోల్‌కి 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అయితే 19.2 కిలోమీటర్లు, సీఎన్‌జీకి 27.1 కిలోమీటర్లు మైలేజీ వస్తుంది.దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.6 లక్షలు.

ఈ జాబితాలో 2వ కారు కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్( Kia Seltos facelift ).ఇది కూడా జూలైలోనే భారత మార్కెట్‌లోకి వచ్చింది.3 ఇంజిన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.దీని ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర రూ.10.89 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.3వ స్థానంలో మారుతి సుజుకి ( Maruti Suzuki )జులైలో తీసుకొచ్చిన ఇన్విక్టో కారు.దీనిని మారుతి యొక్క అత్యంత ప్రీమియం ఎంపీవీగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.24.79గా కంపెనీ పేర్కొంది.ఆ కంపెనీ నుంచి తొలి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు ఇదే.ఇక బైక్‌ల విషయానికొస్తే హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440( Harley Davidson X440 )కి పోటీగా బజాజ్- ట్రయంఫ్ కంపెనీలు సరికొత్త బైక్ తీసుకొచ్చాయి.అదే ట్రయంఫ్ స్పీడ్ 400.దీని ఎక్స్ షో రూమ్ ధర రూ.2.33 లక్షలుగా కంపెనీ పేర్కొంది.ఆ తర్వాత స్థానంలో హార్లే డేవిడ్ సన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఎక్స్440.
హార్లేతో కలిసి హీరో మోటో కార్పొరేషన్ దీనిని అభివృద్ధి చేసింది.దీని ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర రూ.2.29 లక్షలు.







