Yadamma Raju: కాలు వేలు తీసేసినప్పుడు ప్రాణం పోయినట్టు అనిపించింది : యాదమ్మ రాజు?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు( Yadamma Raju ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట పటాస్ షో ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్న రాజు ఆ తర్వాత అదిరింది, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి షోలతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు.

 Jabardasth Comedian Yadamma Raju Gets Emotional About His Accident-TeluguStop.com

ప్రస్తుతం కేవలం జబర్దస్త్ షోలో( Jabardasth ) టీం లీడర్ గా చేస్తున్న విషయం తెలిసిందే.అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లను కూడా పాల్గొంటూ ఉంటారు.

తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజు.

Telugu Yadamma Raju, Jabardasth, Yadammaraju-Movie

ఇది ఇలా ఉంటే ఇటీవలే యాదమ్మ రాజు తన యూట్యూబ్ ఖాతాలో తన కాలికి పెద్ద కట్టుతో ఉన్న వీడియోని షేర్ చేసిన విషయం తెలిసిందే.పక్కనే భార్య స్టెల్లా( Stella ) అతనికి సేవలు చేస్తూ కనిపించింది.దాంతో అభిమానులు అసలు యాదమ్మ రాజుకి ఏమయింది? అంటూ ఆందోళన చెందారు.అయితే ఇటీవలే స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌ మూవీ ప్రమోషన్స్ లోనూ చేతికర్ర సహాయంతో నడుస్తూ కనిపించాడు రాజు.ఇది ఇలా ఉంటే తాజాగా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించాడు జబర్దస్త్ కమెడియన్‌.

బైక్‌ ఢీకొట్టడం కారణంగానే తనకు తీవ్ర గాయాలు అయినట్లు చెప్పుకొచ్చాడు.కొన్నిరోజుల క్రితం టీ తాగడానికి బయటకు వెళ్లాను.

Telugu Yadamma Raju, Jabardasth, Yadammaraju-Movie

అప్పుడే అటుగా బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి నన్ను ఢీకొట్టాడు.బైక్‌ స్కిడ్‌ కావడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగింది.చికిత్సలో భాగంగా డాక్టర్లు కుడి కాలి వేలు తీసేశారు.తొడ భాగం నుంచి చర్మం తీసేసి వేలు దగ్గర అతికించారు.ఒక్కసారిగా ప్రాణం పోయినట్లు అనిపించింది.ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంటోంది.

మూవీ ప్రమోషన్స్‌ లో పాల్గొనాలి కాబట్టి ఇలా ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నా అని కమెడియన్ రాజు( Comedian Raju ) చెప్పుకొచ్చాడు.కాగా రాజు కెరిర్ విషయానికి వస్తే.

పటాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న రాజు తనదైన శైలిలో పంచులు వేస్తూ, ముఖ్యంగా తన భాషతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈక్రమంలోనే జబర్దస్త్‌ షోలోకి అడుగుపెట్టి మరింత క్రేజ్‌ తెచ్చుకున్నాడు.

కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా బిగ్‌ స్క్రీన్‌ పైన మెరిసాడు.జార్జిరెడ్డి, గువ్వాగోరింక, లక్కీ లక్ష్మణ్‌, విద్యార్థి, ఓ సాథియా అనే సినిమాల్లో నటించాడు యాదమ్మ రాజు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube