బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా( Urvashi Rautela ) ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు.ముంబైకి చెందిన ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
ఇలా స్పెషల్ సాంగ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సందడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన బ్రో సినిమాలో మై డియర్ మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు.అంతేకాకుండా ఈ సినిమా ప్రీరిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM) అంటూ ఈమె చేసినటువంటి ట్వీట్ సంచలనగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని అదృష్టం రావడం నిజంగా సంతోషం అంటూ ఈమె పవన్ కళ్యాణ్ ను ఏకంగా సీఎం అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )అభిమానులు దిల్ కుష్ అయ్యారు కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు.గతంలో ఈమె శరవనన్ నుకూడా కాబోయే సీఎం అంటూ కామెంట్స్ చేసినటువంటి ఒక వీడియోని ట్రోల్ చేస్తూ ఈమె అవకాశాల కోసమే అందరిని ఇలా పొగుడుతూ ఉంటారని భారీగా ట్రోల్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఊర్వశి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు.
ఈ క్రమంలోనే అభిమానుల నుంచి ఎక్కువగా ఈమెకు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా ఒక నైటిజన్ మీరు కనుక ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ కు వేస్తారా లేక జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy ) వేస్తారా అంటూ ఈమెను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె చెప్పినటువంటి సమాధానం వైరల్ గా మారింది.
ఈమె తన ఓటును తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను అంటూ సమాధానం చెప్పడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని ప్రేమ చూపిస్తున్నటువంటి ఊర్వశి తన ఓటు ఆయనకే వేస్తానంటూ కామెంట్ చేయడంతో ఇవన్నీ కేవలం అవకాశాలు కోసం మాత్రమే గాలం వేస్తూ ఉంటారని ఈ విషయంలో ఊర్వశి రెండు ఆకులు ఎక్కువే చదివారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.