మామూలుగా ఎవరైనా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా విడిపోయారు అంటే మళ్ళీ కలవటం అనేది కష్టమని చెప్పాలి.ముఖ్యంగా ప్రేమించుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న దంపతులు ఒక్కసారి మనస్పర్దాల వల్ల విడిపోతే మళ్లీ వాళ్ళు కలవడానికి ఇష్టపడరు.
ఇటువంటి విషయాలలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా బాగా మొండిగా ఉంటారు.కానీ కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు తాము విడిపోయిన వారితో దిగిన ఫోటోలు కానీ, వారికి సంబంధించిన విషయాలు కానీ పంచుకోవడంతో మళ్లీ వాళ్ళు కలిసిపోయారేమో అని అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి.
అయితే తాజాగా దీప్తి సునైనా( Deepti Sunaina ) కూడా షన్ను కు సంబంధించిన స్టోరీ పంచుకోవడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.డబ్స్మాష్ వీడియోలతో( dubsmash videos ) అందరి దృష్టిలో పడిన దీప్తి ఆ తర్వాత యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ తో యూట్యూబ్ స్టార్ గా మారిపోయింది.
దీంతో సోషల్ మీడియా ద్వారా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఆ హోదా తోనే రియాలిటీ షో బిగ్ బాస్( Reality show Bigg Boss ) లో అడుగుపెట్టి బుల్లితెరపై కూడా తన పరిచయాన్ని పెంచుకుంది.
బిగ్బాస్ హౌస్లో ఉన్నంతకాలం తన ఆటపాటలతో, అల్లర్లతో అందర్నీ ఆకట్టుకుంది.కానీ హౌస్ నుంచి బయటికి వచ్చాక తనకు వెండితెరపై నుంచి ఎటువంటి అవకాశాలు కూడా రాలేదు.
కేవలం బిగ్ బాస్ వరకు మాత్రమే పరిమితమైంది తప్ప ఎక్కడ పెద్దపెద్ద అవకాశాలు అందుకున్నట్లు అనిపించలేదు.యూట్యూబ్ లో మాత్రం కవర్ సాంగ్స్ చేస్తూనే ఉంది.అయితే తను మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్( Shanmukh Jaswanth ) తో లవ్ లో ఉండగా కొన్ని మనస్పర్దాల వల్ల అతనికి బ్రేకప్ కూడా చెప్పేసింది.

గతంలో వీరిద్దరూ స్నేహం పేరుతో ప్రేమికులుగా మారి ఇద్దరు కలిసి పలు వీడియోస్ కూడా చేశారు.ఇద్దరు కలిసి రీల్ జంటగా బుల్లితెరపై కూడా పాల్గొని బాగా సందడి చేశారు.అలా కొంతకాలం నడిచిన వారి ప్రేమాయణం షన్ను బిగ్బాస్ షో పాల్గొన్నప్పుడు బయటపడింది.
కానీ షన్ను హౌస్ లో సిరి తో మితిమీరి ప్రవర్తించడం వల్ల తను హౌస్ నుండి బయటికి రాగానే బ్రేకప్ చెప్పేసింది దీప్తి.ఆ సమయంలో షన్నుతో పాటు వారి ఫ్యాన్స్ కూడా తట్టుకోలేక పోయారు.

ఇప్పటికీ వీరిని అన్ని మర్చిపోయి ఒకటవ్వమని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటూ ఉంటారు.కానీ వారిద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా దీప్తి తన ఇన్స్టాల్ స్టోరీలో షన్ను తో ఉన్న ఫోటోను పంచుకుంది.అంతేకాకుండా లవ్ సింబల్ తో స్పందించింది. అయితే అసలు విషయం ఏంటంటే.గతంలో వీరిద్దరూ కలిసి మలుపు అనే కవర్ సాంగ్ చేయగా ఆ మ్యూజిక్ బెస్ట్ అవార్డు సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లవ్ సింబల్ తో స్పందించింది.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవ్వగా.
ప్రేమించిన వ్యక్తిని దూరం పెట్టిన కూడా.అతనితో కలిసి చేసిన సాంగ్ కోసం అతనితో ఉన్న ఫోటోని పంచుకోవడంతో తన అభిమానులు ఫిదా అవుతున్నారు.