ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లి అయిన వెంటనే పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అంతేకాకుండా ఇంకొంత మంది హీరోయిన్లు అయితే పెళ్లికాకముందే తల్లి కాబోతున్నారు.
అలాంటి వారిలో అలియా భట్, ఇలియానా (Ileana) వంటి వాళ్ళు ఉన్నారు.కానీ ఇలియానాకి అసలు పెళ్లయింది లేదో తెలియదు.
ఇక ఆలియా భట్( Alia bhatt ) పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యి పెళ్లైన ఏడు నెలలకే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది.ఇదిలా ఉంటే కియారా అద్వానీ పెళ్లి టైం లో కూడా ఒక వార్త నెట్టింట్లో చక్కెర్లు కొట్టింది.
అదేంటంటే.కియారా అద్వాని కూడా ప్రెగ్నెంట్ అని, అందుకే పెళ్లి హడావిడిగా చేసుకుంటుందని వార్తలు వినిపించాయి.
కానీ అందులో ఎలాంటి నిజం లేదు.

అయితే ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ మల్హోత్రా ( Sidharth Malhotra ) కియరా అద్వానీ సినిమాలు పక్కన పెట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నారు.నైట్ టైం డిన్నర్ లకి వెళ్తూ పార్టీలకు వెళ్తూ కొద్దిరోజులు తమ వివాహ బంధానికి టైం కేటాయిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ ఎవరు ఊహించని ఒక విషయాన్ని బయటపెట్టింది.
మరి అదేంటో కియారా అద్వాని మాటల్లోనే తెలుసుకుందాం.నాకు తొందరగా తల్లి అవ్వాలని ఉంది.ఎందుకంటే గుడ్ న్యూస్ నటించినప్పటి నుండి నాకు కూడా పిల్లల్ని కనాలి అనే ఆశ మొదలైంది.అలాగే పిల్లల మీద ఇష్టంతో ప్రెగ్నెంట్ అవ్వాలనే కోరికతో డైట్ గురించి,సినిమాల గురించి ఆలోచించకుండా ఇష్టమైనవన్నీ తింటూ వస్తున్నాను అని చెప్పింది.

అయితే ఆ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ మీకు కవల పిల్లలు పుట్టాలా లేదా ఒక్కరే చాలా అని అడిగితే నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు పుట్టాలి.కానీ ఆ పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటూ ఆన్సర్ ఇచ్చింది.అయితే ప్రస్తుతం కియారా అద్వాని( Kiara Advani ) మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమె మాటలు విన్న చాలామంది నెటిజన్స్ చూస్తుంటే కియారా అద్వాని త్వరలోనే ప్రెగ్నెంట్ కాబోతోంది కావచ్చు.అందుకనే ఈ విషయాన్ని బయట పెట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ కియారా అద్వానీ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో వేచి చూడాలి.