టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా త్వరలో మరో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే సుమారు 98 పేజీల ఛార్జ్ షీట్ ను సిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అదేవిధంగా లీకేజ్ వ్యవహారంలో ఇప్పటివరకు 90 మందిని అరెస్ట్ చేయగా మరో 20 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.







