తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో అభిమానించే స్టార్ శ్రీదేవి ( Sridevi ) అనడంలో సందేహం లేదు.ఆమె చనిపోయిన సమయంలో దేశ వ్యాప్తంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్( Janhvi Kapoor )వరుస సినిమా లు చేస్తూ దూసుకు పోతుంది.బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు లో దేవర సినిమాను చేసేందుకు రెడీ అయింది.

దేవర సినిమా ఈమెకు మొదటి కమర్షియల్ హిట్ ను ఇవ్వబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్( kushi kapoor ) కెరీర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.అక్క సౌత్ ఇండియా లో ఎంట్రీ ఇచ్చింది.మరి చెల్లి ఖుషి కపూర్ సౌత్ లో ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు అన్నట్లుగా శ్రీదేవి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఖుషి కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న జాన్వీ కపూర్
మాదిరిగానే ఖుషి కపూర్ కూడా మంచి సినిమా లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.జాన్వీ కపూర్ మాదిరిగా ఖుషి కపూర్ కూడా తెలుగు లో ఎంట్రీ ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆధరించడం ఖాయం గా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.సోషల్ మీడియా లో జాన్వీ కపూర్ హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఖుషి కపూర్ కూడా అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ముందు ముందు మంచి ఆఫర్లు రావడం కోసం ఈ 22 ఏళ్ల ముద్దుగుమ్మ హాట్ అందాల షో చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఖుషి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తోంది.ఆ సినిమా సక్సెస్ అయితే సౌత్ నుండి ఆఫర్లు అందుతాయేమో చూడాలి.







