తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి.లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
దీంతోపాటు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరుకుంది.ఎన్టీఆర్ జిల్లా ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై వరదనీరు ఐదు అడుగుల మేర ప్రవహిస్తుంది.
ఈ క్రమంలో సుమారు పది కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి.అప్రమత్తమైన అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల దారి మళ్లించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తున్నారు.అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే వాహనాలను సూర్యాపేట నుంచి ఖమ్మం, తిరువూరు మీదుగా విజయవాడకు మళ్లిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఐతవరం వద్ద పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.







