రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో బ్రో మూవీ( Bro movie ) విడుదలైంది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో పవన్ ఫ్యాన్స్ బ్రో మూవీని థియేటర్లలో చూడటానికి క్యూ కట్టారు.
ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు అబవ్ యావరేజ్ నుంచి హిట్ టాక్ వస్తోంది.ఏపీ ప్రభుత్వం( AP Govt ) నుంచి కూడా బ్రో సినిమాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.సాధారణ టికెట్ రేట్లతో తెలుగు రాష్ట్రాల్లో బ్రో మూవీ ప్రదర్శితమవుతోంది.
100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే కమర్షియల్ గా బ్రో మూవీ లాభాలను అందించే అవకాశాలు అయితే ఉంటాయి.అయితే బ్రో సినిమాలో ఉన్న పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.సినిమాలో ఉన్న పొలిటికల్ డైలాగ్స్ ( Political Dialogues )ను చూసి జగన్ సర్కార్ ను వదలవా బ్రో అంటూ నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బ్రో సినిమాలో ఉన్న పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.గాజు గ్లాసు గురించి సినిమాలో ఉన్న డైలాగ్ జగన్ సర్కార్ కు షాకేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.పవన్ పొలిటికల్ కెరీర్ కు ప్లస్ అయ్యే విధంగా ఈ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి.బ్రో సినిమా కమర్షియల్ లెక్కలను మార్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బ్రో మూవీ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.బ్రో మూవీ తొలిరోజు కలెక్షన్లు 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది.ఓవర్సీస్ లో తక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోందని తెలుస్తోంది.బ్రో సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ విషయంలో జగన్ సర్కార్ రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.







