నాగార్జున( Nagarjuna ) కొడుకు గా ఇండస్ట్రీ కి వచ్చిన నాగచైతన్య( Naga Chaitanya ) ప్రస్తుతం సినిమా చేస్తూ ఇండస్ట్రీ లో చాలా బిజీ హీరో గా మారిపోయాడు.నిజానికి నాగచైతన్య వాళ్ల నాన్న అయిన నాగార్జున కి ఉన్న క్రేజ్ కానీ ఆ స్తార్డం కానీ తను అందుకోలేకపోయాడు.
అందుకే నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ పేరు ని నిలబెట్టలేక పోతున్నాడు…ఇక నందమూరి మెగా గట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ హీరోలు స్టార్ హీరోలు అయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఆ విషయం లో వెనకబడిపోయిందనే చెప్పాలి…ఇక నాగచైతన్య విషయం పక్కన పెడితే అఖిల్( Akhil ) అయితే ఒక్క హిట్ కొట్టడానికి కూడా చాలా కష్ట పడుతున్నాడు నిజానికి ఆయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావాల్సి వస్తున్న ఒక్కటంటే ఒక్క మంచి హిట్ కూడా లేదు ఇక ఈ విషయం లో నాగ చైతన్య నే కొంత వరకు బెటర్ అని చెప్పాలి ఎందుకంటే ఆయనకి కొన్ని సినిమాలు మంచి హిట్ ఇచ్చాయి.

మరి ఈ తరం లో అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో అయ్యే హీరో ఇక లేడా అనేది ప్రశ్నార్థకం గా మారింది…ఈ క్రమం లో నాగార్జున అఖిల్ ని స్టార్ హీరోను చేయాలని చేసిన ప్రతి ప్రయత్నం కూడా వృధగానే పోతుంది…ఇక ఈ టైం అఖిల్ తో సినిమా చేయమని నాగార్జున ఇద్దరు యంగ్ డైరక్టర్ల కి రిఫర్ చేసినట్టు గా తెలుస్తుంది అందులో ఒకరు దసర సినిమా</em( Dasara movie ) తో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela )కాగా,మరోకరు సామజవరమగమన సినిమా( Samajavaragamana )తో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ అబ్బరాజు తో చర్చలు జరుపుతున్నట్లు గా తెలుస్తుంది.

ఇక వీళ్లిద్దరూ కూడా రీసెంట్ గా మంచి హిట్ కొట్టిన డైరెక్టర్లు కావడం తో వీళ్లని నాగార్జున అడుగుతున్నట్టు గా తెలుస్తుంది అయితే ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల మళ్ళీ నాని తో ఇంకో సినిమా కమిట్ అయ్యాడు కానీ రామ్ అబ్బరాజు మాత్రం ఇంకా ఏ సినిమా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి రామ్ అబ్బరాజు అఖిల్ తో సినిమా చేసే ఛాన్స్ అయితే ఉంది…చూడాలి మరి అఖిల్ నెక్స్ట్ సినిమా ఎవరి తో ఉంటుందో…
.







