ఏదైనా వాహనం నడపాలంటే మనిషి తప్పనిసరిగా ఉండాలి.బైక్, కారు, ట్రైన్, విమానం.
ఇలా ఏది నడపాలన్నా మనిషి ఉండాలి.కానీ ఇటీవల మనిషి లేకుండానే టెక్నాలజీ సహాయంతో ఆటోమేటిక్ గా నడిచే వాహనాలను కొన్ని కంపెనీలు తయారుచేస్తున్నాయి.
వీటిని డ్రైవ్ చేయాలంటే మనిషి అవసరం లేదు.అవే ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటిస్తూ వెళతాయి.
తాజాగా బెంగళూరు( Bengaluru ) వీధుల్లో డ్రైవర్ లేని కారు దర్శనమిచ్చింది.దీంతో దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

అనిరుధ్ రవిశంకర్( Anirudh Ravishankar) అనే వ్యక్తి ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక కారు బెంగళూరులో తిరుగుతూ ఉంది.కానీ అందులో చూస్తే డ్రైవర్ లేడు.దీంతో డ్రైవర్ లేకుండా కారు నడవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.ఈ కారును చూసేందుకు అందరూ ఎగబడ్డారు.
అందరూ వింతగా దీనిని చూశారు.ఈ కారును బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ అయిన మైనస్ జీరో సంస్థ( Minus zero ) తయారుచేసింది.
ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉన్నట్లు చెబుతున్నారు.జెడ్ పోడ్ అని ఈ కారుకు పేరు పెట్టారు.

ఈ కారు చూడటానికి చాలా కొత్తగా ఉంది.అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ కారు తయారుచేశారు.కానీ కారు చూడటానికి చాలా చిన్నగా, సింపుల్ గా ఉంది.ఈ కారు రోడ్లపై తిరుగుతుండగా జనాలు కళ్లప్పగించి అలాగే చూస్తుండి పోతున్నారు.అయితే ఇతర దేశాల్లో ఇప్పటికే ఇలాంటి కార్లు వచ్చాయి.వీటిని డ్రైవింగ్ చేయాల్సిన పనిలేదు.
సెన్సార్ల సహాయంతో ఎవరైనా ఎదురు వస్తే ఆటోమేటిక్ గా ఆగిపోతాయి.ఆ తర్వాత మళ్లీ కదులుతాయి.
విదేశాల్లో ఇలాంటి కార్లు బాగా సక్సెస్ అయ్యాయి.ఇప్పుడు ఇండియాలో కూడా వీటిని తయారుచేస్తున్నారు.







