ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరు డబ్బు, పదవులు అంటూ ఏదో ఒక దాని వెనుక పడుతున్నారు.ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇమడలేక కొందరు జనాలకు దూరంగా వెళ్లిపోతున్నారు.
చేతిలో చెల్లి గవ్వ కూడా లేకుండా బ్రతకగలమని ఇప్పటికే కొందరు నిరూపించారు కూడా.అయితే అమెరికా దేశం, కొలరాడో రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వీరినే స్ఫూర్తిగా తీసుకొని అడవిలోని పర్వతాలలో నివసించాలని ప్లాన్ చేసింది కానీ దురదృష్టవశాత్తు వారి ప్లాన్ విషాదాంతంగా మారింది.
ఈ కుటుంబ సభ్యులు “ఆఫ్ ది గ్రిడ్”( Off the Grid ) అంటూ విద్యుత్, ఫోన్‌ల వంటి మోడర్న్ ఫెసిలిటీస్ లేకుండా జీవించాలని ఒక అడవిలోని పర్వతాల్లోకి వెళ్లిపోయారు.వారిలో ఇద్దరు సిస్టర్స్ క్రిస్టీన్( Christine ) (41), రెబెక్కా( Rebecca )(42) ఉన్నారు.
రెబెక్కా 14 ఏళ్ల కుమారుడు కూడా వారితో పాటే వెళ్ళాడు.నిజానికి ఈ ముగ్గురికి అడవిలో నివసించిన అనుభవం కొంచెం కూడా లేదు.
అందుకే అడవి లోపలికి వెళ్లేందుకు ముందు అక్కడ ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో వీడియోలను చూశారు.

ఈ కుటుంబ సభ్యులు సమ్మర్ టైమ్‌లో తమ సాహసయాత్రకు బయలుదేరారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండటం వల్ల వారు బతకగలిగారు.కానీ వారు కఠినమైన శీతాకాలానికి తట్టుకోగల విధంగా సిద్ధం కాలేదు.
ఆ చలికాలంలో వారికి తగినంత ఆహారం కూడా దొరకలేదు.ఒకవైపు చలి మరొకవైపు ఆకలిని తట్టుకోలేక చివరికి వారు అత్యంత దయనీయ పరిస్థితులలో ప్రాణాలను కోల్పోయారు.

వారి మృతదేహాలను రిమోట్ క్యాంప్‌సైట్‌లో ( remote campsite )ఒక హైకర్ కనుగొన్నాడు.సిస్టర్స్ క్రిస్టీన్, రెబెక్కా ఒక టెంట్ లోపల కనిపించగా 14 ఏళ్ల బాలుడు బయట విగత జీవిగా మారి కనిపించాడు.వారు ఆ ప్రాంతంలో ఒక ఇంటిని నిర్మించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది, అయితే శీతాకాలపు వాతావరణం కారణంగా తిరిగి టెంట్‌లోకి వెళ్లవలసి వచ్చింది.ఈ ప్రమాదకరమైన ప్రయాణానికి వెళ్లవద్దని వారి కుటుంబం వారిని హెచ్చరించింది, కానీ వారు ఆఫ్ గ్రిడ్ జీవించాలని నిశ్చయించుకున్నారు.
అయితే చివరికి వారు అకాల మరణం చెంది అందరి చేత కంటతడి పెట్టించారు.అడవిలో నివసించడం అంత సులభమేమీ కాదని, వెళ్లే ముందు అన్ని ప్రమాదాలను అంచనా వేసుకోవాలని పోలీస్ అధికారులు వెల్లడించారు.







