టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు( Mahesh Babu ) అతి తక్కువ సమయంలో సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు.చిన్నవయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టి తన నటనతో తండ్రికి తగ్గట్టుగా పేరు సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత హీరోగా అడుగుపెట్టి మంచి మంచి హిట్ లు అందుకొని స్టార్ హోదాకు చేరుకున్నాడు.మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు.
ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే నటి నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
నమ్రత( namrata ) పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది.ఇక మహేష్ బాబు ఒక వైపు ఫ్యామిలీని చూస్తూ మరోవైపు తన నటన వృత్తిని కొనసాగిస్తున్నాడు.
అంతేకాకుండా పలు బిజినెస్ లు కూడా మొదలుపెట్టగా అవన్నీ నమ్రత దగ్గర ఉండి చూసుకుంటుంది.

మహేష్ బాబు ఏడాది కిందట సర్కారు వారి పాట సినిమాతో ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలకు కూడా ఓకే చేశాడు.ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.
ఇక ఈ సినిమాను ఎస్.ఎస్.ఎమ్.బి 28 ( SSMB 28 )గా రూపొందిస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్( Director Trivikram ) తో అతడు, ఖలేజా సినిమాలు చేయగా ప్రస్తుతం మూడో సినిమాగా ఈ సినిమా రూపొందుతుంది.ఇందులో శ్రీ లీల తో పాటు మరో హీరోయిన్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూలు పూర్తి కాగా ప్రస్తుతం మూడో షెడ్యూల్ బిజీగా ఉంది.కానీ ఈ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ రోజు వినబడుతూనే ఉంది.
అయితే ఇదంతా పక్కన పెడితే మామూలుగా మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు తప్ప ఇతర హీరోల సినిమా ఈవెంట్ కు, అవార్డు ఫంక్షన్స్ కు హాజరైనట్లు అస్సలు కనిపించడు.

అయితే దానికి ఒక పెద్ద కారణం ఉందని తెలుస్తుంది.అయితే ఓసారి మహేష్ బాబు నటించిన సినిమా అర్జున్ సినిమా ( Arjun movie )పైరసీ అయ్యింది.దీంతో సినిమా విడుదల కాకముందుకే ఈ సినిమా పైరసీ అవ్వటంతో ఆ సమయంలో మహేష్ బాబు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళాడట.
ఆ సమయంలో ఆయనకు ఏ హీరో కూడా సపోర్టుగా రాలేదు.కానీ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయనకు దగ్గర ఉండి ధైర్యం ఇచ్చాడట.మామూలుగా సెలబ్రేషన్స్ అప్పుడు అందరు కలిసి ఉంటారు కానీ ఏదైనా కష్టం వస్తే ఎవ్వరూ పట్టించుకోరు అని.దాంతో తనకు చాలా బాధ అనిపించిందని అప్పటినుంచి ఎవరి సినిమా ఈవెంట్లకు వెళ్ళనని గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తెలిపినట్లు తెలిసింది.అందుకే మహేష్ బాబు ఇతర సినీ సెలబ్రేషన్స్ లలో ఎక్కువగా కనిపించడు.







