సక్సెస్ సాధించడం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.రూపాయి లేకుండా సినిమాల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయలు సంపాదించాలంటే సులువైన విషయం కాదు.
సింగర్, లిరిక్ రైటర్ కనగాల జయకుమార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ రజనీకాంత్ సక్సెస్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.రజనీకాంత్( Rajinikanth ) అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్ అని కారు నలుపులో రజనీ పుట్టాడని ఆయన అన్నారు.
రజనీకి చిన్న వయస్సులో మెల్ల కన్ను కూడా ఉండేదని కనగాల జయకుమార్( Kanagala Jayakumar ) తెలిపారు.బాల్యంలో రజనీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
గుండీలు తీసేసి గొడవల విషయంలో ముందువరసలో రజనీ ఉండేవారని వాళ్ల నాన్న రజనీని చింత బర్రెతో కొట్టేవాడని ఆయన పేర్కొన్నారు.నన్ను చంపేయ్ అని నాన్నతో రజనీ అనేవాడని, రజనీ కల్లు తాగేవాడని కనగాల జయకుమార్ అన్నారు.

చివరకు బెంగళూరు ఆర్టీసీలో( Bangalore RTC ) రజనీ ఉద్యోగంలో జాయిన్ ఆయ్యడని ఆయన కామెంట్లు చేశారు.రజనీ డబ్బులు దొంగతనం కూడా చేశాడని ఆయన పేర్కొన్నారు.ఎవరైనా ఏమైనా అంటే రజనీ అస్సలు సహించేవాడు కాదని కనగాల జయకుమార్ తెలిపారు.తల్లి చనిపోయిన తర్వాత రజనీ ప్రేమకు దూరమయ్యాడని ఆయన అన్నారు.రాజబహదూర్ అనే మిత్రుడు రజనీని ప్రోత్సహించాడని జయకుమార్ చెప్పుకొచ్చారు.

రాజబహదూర్( Rajabahadoor ) సూచనల మేరకు రజనీ సినిమాలపై దృష్టి పెట్టాడని ఆయన అన్నారు.రజనీ స్టైల్ నచ్చి బాలచందర్ గారు ఛాన్స్ ఇచ్చారని తెలిపారు.తమిళం నేర్చుకుని రజనీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారని ఆయన పేర్కొన్నారు.
కనగాల జయకుమార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్నో కష్టాలు అనుభవించినా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ రజనీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్( Kollywood ) నంబర్ వన్ హీరోలలో ఒకరిగా ఉన్నారు.







