వేములవాడ ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ట్రయల్ రన్( Vemulawada FSTP Trail Run ) ను ఆగస్ట్ 5 కల్లా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్ లను అదేశించారు.మంగళవారం సాయంత్రం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మొదట వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధి( Vemulawada Municipality Development ) పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ తిప్పాపూర్ వద్ద మూలవాగు బండ్ సుందరీకరణ పనులను 15 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.కౌన్సిల్ ఆమోదం తీసుకొని జగిత్యాల కమాన్ జంక్షన్ పనులను ప్రారంభించాలని సూచించారు.
మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన 15 పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో ఇప్పటికే 11 పూర్తి అయినందున మిగతా పనులను పెయింటింగ్ వర్క్ తో సహా జూలై 31 లోగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.వేములవాడ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న గ్రంథాలయ పనులను సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
అలాగే వేములవాడ ఆలయం కు సంబంధించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ధర్మగుండం అభివృద్ధి, మరమ్మత్తు, సుందరీకరణ పనులను దసరా లోగా పూర్తి చేయాలన్నారు.నిర్మాణంలో ఉన్న శివార్చన స్టేజ్ పనులను వేగిరం చేయాలన్నారు.
బద్ది పోచమ్మ అభివృద్ధి కి సంబంధించి అగ్రిమెంట్ పనులు పూర్తి చేసుకుని పనులను వెంటనే ప్రారంభించాలని ఆలయ కార్యనిర్వాక అధికారి, కార్య నిర్వాహక ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.వర్షాకాలంలో ఆలయం, ఆలయ ఆవరణలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 9 వేల మిషన్ భగీరథ కనెక్షన్లను ఇవ్వడం పట్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంతృప్తి వ్యక్తం చేశారు.గృహాలకు మిషన్ భగీరథ( Mission Bhagiratha ) ద్వారా క్రమం తప్పకుండా ప్రతిరోజు త్రాగునీటిని సరఫరా చేయాలన్నారు.
అలాగే మున్సిపాలిటీ పరిధిలోని త్రాగునీటి ట్యాంకులను ప్రతి పది రోజులకు ఒకసారి క్లీనింగ్ చేయాలన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లతో సమీక్షించారు.ఈదుల చెరువు పరిధిలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమిష్టిగా అక్రమ నిర్మాణ లను గుర్తించి వెంటనే తొలగించాలని చెప్పారు.అక్రమ నిర్మాణాల తొలగింపులో ఇండ్లను కోల్పోయిన పేదలకు సంబంధించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరుకు హామీవాలన్నారు.
రెండవ బైపాస్ లో వాగులు, వర్షపు నీటి ప్రవాహాలను ఆక్రమిస్తూ ఎవరైనా నిర్మాణాలను చేపడితే వాటిని తొలగించాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.రగుడు పెద్ద చెరువుకు గేట్ల నిర్మాణం వీలుగా ప్రతిపాదన సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.రగుడు జంక్షన్ అభివృద్ధి పనుల తో పాటు మొదటి బైపాస్ ప్లాంటేషన్, లైటింగ్ పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలన్నారు.ప్లాంటింగ్ కు అవసరమైన అవసరమైన మొక్కలను హెచ్ఎండిఏ సాధ్యమైనంత త్వరగా తెప్పించాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.
శాంతినగర్, పెద్దూర్ లో అన్ని సదుపాయాల తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్ధం అయ్యేలా మానిటర్ చేయాలని మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్( District Collector ) ఆదేశించారు.సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేయాలన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 12 స్కూల్ లో చేపట్టిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనుల ఫినిషింగ్ స్టేజిలో ఉన్నందున మిగతా పనులు పెయింటింగ్ తో సహా పూర్తి చేయాలన్నారు.అన్ని స్కూళ్లలో టాయిలెట్ పనులను పూర్తి చేయాలన్నారు.
మోడల్ టౌన్ షిప్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు . 20 ఎకరాల లే అవుట్ లో లెవెలింగ్ జంగల్ క్లియరెన్స్ పనులు ఇప్పటికే పూర్తయినందున అంతర్గత రోడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు.హద్దురాళ్ళను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.సిరిసిల్ల ఆర్డీవో , మున్సిపల్ కమిషనర్ మోడల్ టౌన్ షిప్ హద్దురాళ్ల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
టి ఎస్ బి పాస్ దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, పవన్ కుమార్, వేములవాడ ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావు, మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, అన్వేష్, ఆలయ ఈఈ రాజేష్, ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, తహశీల్దార్లు విజయ్ కుమార్, రాజు, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయితీ రాజ్ శాఖల డీఈ లు, ఏఈ లు, తదితరులు పాల్గొన్నారు.







