టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్( NTR ) RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా గ్లోబల్ స్టార్ గా ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర ( Devara ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే కెరియర్ పరంగా ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉండగా ఈయన వారసుడు అభయ్ రామ్ ( Abhay Ram ) కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో అభయ్ రామ్ కీలక పాత్రలో నటించబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరు వెల్లడించలేదు.ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే.
అయితే ఎన్టీఆర్ ఏదైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు తప్ప వీరి ఫ్యామిలీ ఫోటోలు బయటకు రావు.ఇలా ఎన్టీఆర్ తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.

సోషల్ మీడియా అంటేనే ఇక్కడ ఎంత మంచి ఉంటుందో అంతే చెడు కూడా ఉంటుంది.పాజిటివిటీతో పాటు నెగెటివిటీని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే తన పిల్లలను సోషల్ మీడియాలోకి అడుగుపెట్టకుండా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారట.ఇలా సోషల్ మీడియాలోకి కనుక అడుగుపెడితే ఆ వారి చదువుపై ఆ ప్రభావం ఉంటుందని అందుకే వారిని దూరంగా పెట్టాలని నిర్ణయాన్ని తీసుకున్నారట.ఈ విధంగా ఎన్టీఆర్ పిల్లల విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తెలిసి అభిమానులు ఇది చాలా మంచి నిర్ణయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







