నల్లగొండ జిల్లా: మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాశిమల్ల లింగయ్యకు చెందిన పూరిల్లు గోడ కూలిపోయి, గాలికి ఇంటి కమ్మలు లేచిపోవడంతో వర్షానికి ఇంట్లో వస్తువులను తడిసి ముద్దయ్యాయి.
ఇద్దరు ఆడపిల్లలతో కలిసి తడుస్తూ అందులోనే ఉంటున్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.కనీసం ఇంటిపై కమ్మలు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఎవరైనా దాతలు సహాయం చేస్తారని ఎదురుచూస్తున్నారు.







