ఐఫోన్ కోసం ఆశపడితే ఏకంగా రూ.7లక్షలు పాయే..!

ఆన్ లైన్ లో బహుమతుల పేరుతో ఉచితంగా వచ్చే వస్తువుల కోసం ఆశపడితే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్టే.దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు( Cyber Crimes ) ఆన్ లైన్ ద్వారా అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు అన్ని దారులను తెరచి ఉంచారు.

 Scammers Robbed 7 Lakhs From Gujarat Man In The Name Of Iphone 14 Details, Scamm-TeluguStop.com

అత్యాశ ఉండే అమాయకులు సైబర్ వలలో చిక్కి తమను తాము నిలువు దోపిడీ చేసుకుంటున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ వ్యక్తి బహుమతి రూపంలో ఐఫోన్( iPhone ) వస్తుంది అని ఆశపడి ఏకంగా రూ.7 లక్షలు పోగొట్టుకున్నాడు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

గుజరాత్ లోని( Gujarat ) అహ్మదాబాద్ లో ధన్ ధూకా ప్రాంతంలో విరాగ్ దోషి( Virag Doshi ) అనే ఒక యువ వ్యాపారవేత్త నివాసం ఉంటున్నాడు.అతనికి ఇంస్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చింది.

ఆ మెసేజ్ లో దుబాయ్ లోని బడేబాయ్ అండ్ చోటే బాయ్ అనే ఎలక్ట్రానిక్ స్టోర్ లక్కీ డ్రా లో ఐఫోన్ 14 గెలుచుకున్నారు.రూ.3000 చెల్లిస్తే.ఐఫోన్ 14 కొరియర్ చేస్తామని అందులో రాసి ఉంది.

Telugu Ahmedabad, Badebhai, Cyber, Dubai, Gujarat, Iphone, Robbed Lakhs, Scammer

విరాగ్ దోషి రూ.70 వేల ఐఫోన్ రూ.3 వేలకే వస్తుందని అత్యాశపడి వెంటనే ఆ మెసేజ్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు యూపీఐ ద్వారా రూ.3 వేలను చెల్లించాడు.అనంతరం +92 కోడ్ ఉన్న నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.తాము బడే బాయ్ అండ్ చోటే బాయ్ స్టోర్ నుండి మాట్లాడుతున్నామని ఐఫోన్ 14 తో పాటు అదనంగా స్మార్ట్ వాచ్ కూడా కొరియర్ ద్వారా పంపుతున్నట్లు చెప్పి, సూరత్ ఎయిర్పోర్ట్ నుంచి కొరియర్ డెలివరీ అవుతుందని తెలిపాడు.

Telugu Ahmedabad, Badebhai, Cyber, Dubai, Gujarat, Iphone, Robbed Lakhs, Scammer

మరుసటి రోజు విరాగ్ కు సంజయ్ శర్మ( Sanjay Sharma ) అనే వ్యక్తి ఫోన్ చేసి సూరత్ ఎయిర్పోర్టులో తాను డెలివరీ విభాగంలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.వీరాగ్ పేరుమీద ఒక పార్సెల్ వచ్చిందని.డెలివరీ చేయాలంటే రూ.8 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.విరాగ్ వెంటనే డబ్బును వదిలి చేశాడు.అనంతరం డబ్బు బదిలీ చేశానని తెలపడానికి విరాగ్ ఫోన్ చేయగా అవతల నుండి స్పందన లేదు.అనుమానంతో విరాగ్ తన బ్యాంక్ ఖాతాను చెక్ చేయగా రూ.6.76 లక్షల నగదు విత్ డ్రా ఈనట్లు తెలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.నిందితులు వర్చువల్ నెంబర్ల సాయంతో మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube