నాస్తికుడు….అంటే దైవంపై నమ్మకం లేను వాడు బి అర్ధం.
భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అంటారు.ఐతే కొందరు నాస్తికులు ఆ మతాన్ని పాటించకుండా తమ పని తాము చేసుకుంటుంటే మరి కొందరు మాత్రం కేవలం హిందూ మతాన్ని( Hinduism ) దూషించే పనిలో ఉన్నారు.
అలాంటి కోవకు చెందినవాడే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.ఆయన తాను నాస్తికుడని అని బహిర్గతంగా చెప్పడం మన అందరికి తెలిసిన విషయమే.
ఈ కారణంగానే కాషాయ క్యాంపు కు ప్రకాష్ రాజ్( Prakash raj ) కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.ప్రకాష్ రాజ్ ఎప్పుడు అవకాశం దొరికిన రిఘ్టిస్టులపై విరుచుకుపడుతుంటారు.
ఈ మధ్య ప్రకాష్ రాజ్ నటించిన చిత్రం రంగమార్తాండ( Rangamarthanda ) ఈ చిత్రం లో బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ను చెంప మీద కొట్టి ఇలా అంటాడు “నువ్వొక చెత్త నటుడివిరా…మనిషిగా అంతకుమించి నీచుడివిరా…”.ఈ వీడియోను కాషాయ క్యాంపువారు బాగా వైరల్ చేసారు.

ఐతే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది చదివితే మీకే అర్ధమవుతుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ( Indian Space Research )ఒర్గనిసతిఒన్ (ఇస్రో) జులై 14న చంద్రయాన్ త్రీ ప్రయోగం చేసారు.ఆ ప్రయోగం చేయకముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ” స్వశక్తిపై ఆధారపడలేని వారు దేవుడ్ని ఆశ్రయిస్తారు” అని ట్విట్టర్ లో ఎగతాళి చేసారు.
ఈ ట్వీట్ కి స్పందిస్తూ విశ్వేశ్వర భట్( Vishweshwar Bhat ) అనే ఒక సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ ట్విట్టర్లో రాసారు.ఆ పోస్ట్ లో అయన ఏం రాసారంటే ప్రకాష్ రాజ్ తనకు ఒక రోజు ఫోన్ చేసి ” నా రెండొవ భార్య ఇంకా గర్భవతి కాలేదు.
ఆమెకు సర్పదోషం ఉంది అంటున్నారు.

పరిహారం కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెళ్లి అక్కడ పరిహారం చేయించాలి.ఆలా చేస్తే తప్ప తనకు గర్భం రాదు అని నా భార్యకు ఎవరో చెప్పారు.కనుక అక్కడ పూజ చేయించాలి.
అక్కడ మీకు ఎవరైనా తెలుసా? ” అని అడిగారట.అప్పుడు విశ్వేశ్వర భట్ మంగుళూరు లో ఉన్న తన కరస్పాండెంట్ జితేంద్ర అనే వ్యక్తికి చెప్పి వారికి అవసరమైనవన్నీ సమకూర్చారట.
తరువాత అతని భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.ప్రకాష్ రాజ్ దంపతులిద్దరూ స్వయంగా ఫోన్ చేసి కృతఙ్ఞతలు చెప్పారట.” కేవలం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి కృప వాళ్ళ ప్రకాష రాజ్ మల్లి తండ్రి అయ్యారు.ఆయన దీనిని కాదనగలరా?” అంటూ విశ్వేశ్వర భట్ ప్రశ్నించారు.విశ్వేశ్వర భట్ విశ్వ వాని అనే కన్నడ వార్తాపత్రికకు చీఫ్ ఎడిటర్.ఆయన గతంలో కన్నడ ప్రభ, విజయ కన్నడ వంటి ప్రముఖ పత్రికలకు ఎడిటర్గా పనిచేసారు.
ఇప్పుడు ట్విట్టర్లో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.







