బోయపాటి వాసు గారు ఈనెల 23న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Ajay Kumar Puvvad ) గారు ఖమ్మం : పట్టణం లారీ యజమానుల సంక్షేమ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం ప్రధాన కార్యదర్శి బోయపాటి వాసు( Boyapati Vasu ) ఓ ప్రకటనలో కోరారు.
ఈనెల 23వ తేదీన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు , ఎంపీ నామా నాగేశ్వరరావు( Nama Nageswara Rao ) గారు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు హాజరుకానున్నట్లు తెలియజేశారు.దీన్ని గమనించి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.







