తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి అన్నాడు సుమతి శతక కర్త బద్దెన.నిన్న మొన్నటి వరకు పార్టీలో అసంతృప్తి జ్వాలలతో అంత: కలహాలతో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ( Congress Party ) నేడు కీలక నేతలతో కలకలలాడిపోతుంది.కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిన నేతలంతా పునరేకీకరణ పేరుతో తిరిగి గాంధీ భవన్ కు చేరుతుంటే అధికార బారాస పార్టీ లోని అసంతృప్తి నేతలు చూపు కూడా కాంగ్రెస్ వైపే ఉండటంతో ఇప్పుడు గాంధీభవన్ కిక్కిరిసిపోతున్నట్లుగా తెలుస్తుంది.వారానికి ఒక కీలక నేతను తమ పార్టీలోకి చేర్చుకుంటున్న కాంగ్రెస్ నయా జోష్ తో ఎన్నికలకు సిద్ధం అవుతుంది.

నిన్న మొన్నటి వరకు తులసి మొక్కల్లా ఉన్న కాంగ్రెస్ నేడు మర్రి చెట్టు లా ఎదిగి అధికార పార్టీకి గుబులు పుట్టిస్తుంది.ఇప్పుడు కాంగ్రెస్ లో మరి కొంతమంది కీలక నేతలు చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,( Teegala Krishna Reddy ) ఆయన కోడలు అనితా రెడ్డి కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.సబితా ఇంద్రారెడ్డి( Sabita Indra Reddy ) బారాసా లో చేరడంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి సీటు కన్ఫర్మ్ కానందున కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యే యేన్నం శ్రీనివాసరెడ్డి తో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి , వికారాబాద్ జిల్లా జడ్పీ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత ఏనుగు రవీందర్ రెడ్డి, వేముల వీరేశం ఇలా లిస్టు చాలా ఉందని వీరు ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమక్షంలో పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ నేతల చేరికతో కాంగ్రెస్ పార్టీలో చాలా ఆత్మవిశ్వాసం కనబడుతుందని అధికారం లోకి రాబోతున్నాం అన్నవాతావరణం కూడా కాంగ్రెసు లో కనిపిస్తుంది అని విశ్లేషణ లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది .







