2014 ఎన్నికలలో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ఆ తదనంతర పరిణామాలతో ఎన్డీఏకు దూరమైంది.ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిజెపిపై కోపంగా ఉన్నారని అంచనా వేసిన తెలుగుదేశం వ్యూహాత్మకంగా బిజెపిని వదిలించుకుంది.
అంతేకాకుండా యూపీఐ కి దగ్గరవుతూ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు కూడా పెట్టుకోవడంతో కమలనాథుల్లో చంద్రబాబు పట్ల ఆగ్రహం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది .దానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని భాజాపా( BJP party )కు దగ్గర ఇవ్వడానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కమలనాధులు కనికరించలేదు అనే విశ్లేషణ ఉంది.అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.మారుతున్న పరిస్థితులు దృష్ట్యా కొత్త మిత్రులతో అవసరం పడిన భాజపా తెలుగు దేశాన్ని కూడా దగ్గరికి తీసే విధంగా వ్యవహారం నడిచింది.
చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకున్న బిజెపి అధిష్టానం ఆ మేరకు చర్చలు కూడా జరిపింది .

అయితే ఎక్కడ చెడిందో ఏమో గాని గత కొన్ని రోజులుగా మళ్ళీ తెలుగుదేశంతో భాజపా దూరం పాటిస్తుంది .ఎన్డిఏ మిత్రపక్షాల భేటీకి కూడా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందలేదు.వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ప్రాథమికంగా పొత్తు చర్చల దగ్గరే వీరి మధ్య విభేదం వచ్చిందని, ఆంధ్ర ప్రదేశ్ లో కనీస ఓట్ బ్యాంక్ కూడా లేకుండా మెజారిటీ ఎంపీ స్థానాలను భాజపా కోరుకుంటున్నందున రాజకీయంగా ఇది తమకు ఇబ్బందికరమవుతుందని గ్రహించిన చంద్రబాబు( Chandrababu naidu ) పొత్తు వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్లడం లేదని అందుకోసమే వ్యూహాత్మకంగా భాజపా తెలుగు దేశాన్ని దూరం పెడుతుందని తెలుస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తులు కచ్చితంగా ఉంటాయని వాదిస్తున్న పవన్( Pawan kalyan ) మరి ఆ మేరకు బిజెపి అధిష్టానాన్ని ఒప్పించగలనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ పై భాజపా నేతలు పవన్ కు బ్రెయిన్ వాష్ చేసి తమకు అనుకూలంగా ఉండేలా చక్రం తిప్పవచ్చు అంచనాలు కూడా ఉన్నాయి.ఏది ఏమైనప్పటికీ మిత్రులు బలాన్ని తనకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్న భాజపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది .ఎలానో జగన్తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు డిమాండ్లకు ఏ రకంగానో తలొగ్గకూడదని ఇప్పుడు అవసరం చంద్రబాబుకే తప్ప తమకు లేదన్న సంకేతాలను భాజాపా ఇస్తుంది .మరి ఎన్నికలకు దగ్గరకు వస్తే తప్ప పొత్తు వ్యవహారాలు ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు
.






