ఢిల్లీలో పదేళ్ల బాలిక( 10 year Old Girl )ను ఇంటి పనిమనిషిగా పెట్టుకుని, ఆ చిన్నారిపై దారుణంగా ప్రవర్తించినందుకు ఓ పైలట్, ఆమె భర్త చిక్కుల్లో పడ్డారు.ఆ పైలట్ పేరు పూర్ణిమ బాగ్చి, ఆమె భర్త పేరు కౌశిక్ బాగ్చి.
ఆయన కూడా పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.పూర్ణిమ ఇండిగో కంపెనీలో పైలట్( Indigo Pilot )గా వర్క్ చేస్తుంది.
ఆమె భర్త వేరే విమానయాన సంస్థకు పని చేస్తారు.అయితే వారు బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధమని తెలిసినా ఓ మైనర్‌ను పనిమనిషిగా పెట్టుకున్నారు.

అంతేకాదు, ఆ బాలికను చిత్రవధకు గురి చేశారు.బాలికకు గాయాలు కావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.బాలికకు అయిన గాయాలను చూసి వారు చెలించి పోయారు.మౌనంగా ఉండలేక దంపతుల ఇంటి బయట గుమిగూడి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తర్వాత వారి కోపం కట్టలు తెంచుకుంది.అంతే పైలట్, ఆమె భర్తను బయటికి లాగి మరీ వీర కొట్టుడు( Thrashed by Mob ) కొట్టారు.
తరువాత ఒక వృద్ధుడు వారిని ఆపాడు.చిన్నారిని గాయపరిచి బాల కార్మికులను ఉపయోగించుకున్నందుకు దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లగా, ఆమె శరీరంపై కొట్టిన గాయాలు, కాలిన గాయాలు కనిపించాయి.ఆ బాలిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని పోలీసులు తెలిపారు.విమానయాన సంస్థ ఇండిగో లేడీ పైలట్‌పై చర్య తీసుకుంది.ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించింది.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే 14 రోజుల జ్యూడిషల్ కస్టడీ విధించగా ఆమె తీహార్ జైలుకు వెళ్ళింది.
బాలిక పట్ల చాలా కఠినంగా ప్రవర్తించిన పైలట్, ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్( Viral Video అయింది.
చిన్న పిల్ల అని కూడా చూడకుండా హింసించిన వీరిని ఇంకా ఎక్కువ కొట్టినా బాగుండు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.పోలీసులు వారిని వెంటనే వదిలేస్తారేమోనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







