మహేష్ బాబు( Mahesh Babu ) అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంచి పేరు ఉంది ఎటువంటి కాంట్రవర్సీ లు లేకుండా హన సినిమాలు తను చేసుకుంటూ చాలా కూల్ గా సింపుల్ గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు మహేష్ బాబు ఇక ఆయన నటించిన గుంటూరు కారం సినిమా( Guntur Karam ) తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా సూపర్ గా ఉండటం తో ఈ సినిమా మీద అంచనాలు తర స్థాయి కి చేరాయి…అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబో( Mahesh Trivikram Combo ) లో వచ్చిన అతడు, ఖలేజా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా.గుంటూరు కారంపై మాత్రం అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్.రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
ఈ మూవీలో మొదట మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు.కానీ, అనివార్య కారణాల వల్ల పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది.దాంతో మహేష్ బాబు సూచన మేరకు శ్రీలీల( Sreeleela )ను మెయిన్ హీరోయిన్ చేసి.సెకండ్ హీరోయిన్ రోల్ ను మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary )ని ఎంపిక చేశారు.
హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది…
రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
అలాగే ఇటీవల బయటకు వచ్చిన గుంటూరు కారం ఫస్ట్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా దక్కింది.అయితే ఈ సినిమాకు మహేష్ బాబు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు మాత్రమే టాలీవుడ్ లో రూ.100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు…
మహేష్ బాబు ఇంత వరకు ఒక్క పాన్ ఇండియా ఇమేజ్ చేయలేదు.ఆయన కూడా ఆయన గుంటూరు కారం సినిమాకు ఏకంగా రూ.80 కోట్లు రెమ్యునరేషన్( Mahesh Babu Remuneration ) ఛార్జ్ చేస్తున్నాడట.తాజాగా బయటకు వచ్చిన ఈ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.ఈ విషయం తెలిసి మహేష్ బాబు ముందు పాన్ ఇండియా హీరోలు కూడా దిగదుడుపే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గుంటూరు కారం అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నాడు.మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే 29వ చిత్రమిది.వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది…ఇక ఈ సినిమా తో మహేష్ డైరెక్ట్ గా పాన్ వరల్డ్ హీరోగా పేరు సంపాదించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి…
.