నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.బాధిత మహిళ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…వింధ్య అనే గర్భిణీ మంగళవారం ఉదయం పురిటి నొప్పులతో ప్రసవం కోసం కమలా నెహ్రూ ప్రభుత్వాసుపత్రికి రావడంతో పరీక్షించిన వైద్యులు సహజ ప్రసవం అవుతుందనని చాలాసేపు నిరీక్షించారు.
అనంతరం ఆపరేషన్ చేయాలని సూచించారు.ఆపరేషన్ చేస్తున్న క్రమంలో కడుపులో ఉన్న బేబీకి పల్స్ రేట్ పడిపోవడంతో అయోమయానికి గురైన డాక్టర్లు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలని చేతులెత్తేశారు.
దీనితో బంధువులు హుటాహుటిన నల్గొండ( Nalgonda )లోని ప్రైవేట్ హాస్పిటల్ కి అంబులెన్స్ లో తరలించారు.గర్భిణీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఎవరూ అడ్మిట్ చేసుకోలేదు.
కుటుంబ సభ్యులు, ఆసుపత్రిలో ఉన్న ఇతర పేషెంట్లు కాళ్ళవేళ్ళా పడడంతో అడ్మిట్ చేసుకొని డెలివరీ చేయగా శిశువు మృతి( Baby) చెందగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది.దీనితో పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే వైద్యులు నిర్లక్ష్యంగావ్యవహరించి బిడ్డ ప్రాణాలను తీశారని,తల్లి ప్రాణాప్రాయ స్థితిలోకి వెళ్లదానికి కారణమయ్యారని ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు,బంధువులు కమలా నెహ్రూ హాస్పిటల్ ముందు బేబీ మృతి కారణమైన డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని,అలాగే తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు బేబీ డెడ్ బాడీతో ధర్నా దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీనితో హాస్పిటల్ ముందు పోలీసులు భారీగా మోహరించారు.పోలీసులు కేసు పెట్టండి చర్యలు తీసుకుంటామని బాధితులకు నచ్చచెప్పటంతో ధర్నా విరమించారు.
ఈ విషయమై హాస్పిటల్ సూపరిండెంట్ ను వివరణ కోరగా వింధ్య అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్ కి వచ్చింది.పరీక్షించిన తరువాత ఆపరేషన్ చేయవలసి వస్తుందని చెప్పాం.
వారి బంధువులు మాత్రం నార్మల్ డెలివరీ కావాలని కోరగా బేబీకి కష్టమవుతుందని తెలిపాం.అయినా ఫర్వాలేదనడంతో నార్మల్ డెలివరీ చేస్తున్న క్రమంలో బేబీ బయటకు రావడంతో ఇబ్బంది ఏర్పడింది.
దీనితో హాస్పిటల్ లో సరైన ఎక్విప్మెంట్ లేకపోవడంతో మరో హాస్పిటల్ కి రిపర్ చేశాం.అంతే తప్ప మా నిర్లక్ష్యం ఏమీ లేదని చెప్పడం గమనార్హం.