లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanatara) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ను, మార్కెట్ ను పెంచుకోవడంతో పాటు పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న నయనతారకు సోషల్ మీడియాలో అంతకంతకూ పెరుగుతున్న క్రేజ్ అభిమానులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పెళ్లైనా, వయస్సు పెరుగుతున్నా నయనతారకు ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.తాజాగా విఘ్నేష్ శివన్ నయనతారను చూస్తే గర్వంగా ఉందని కామెంట్ చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.
నయనతార జవాన్ సినిమాలో నటించగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.జవాన్ సినిమాలో నయనతార లుక్ ను షేర్ చేసిన విఘ్నేష్ నయన్ ను చూస్తుంటే ఆనందంగా, గర్వంగా ఉందని అన్నారు.
షారుఖ్ ఖాన్(Shah Rukh Khan ) కు అభిమానిగా ఆయన నటించిన సినిమాలన్నీ చూసిన నయన్ ఇప్పుడు షారుఖ్ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిందని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు.నయన్ ఇంకా మంచి సక్సెస్ లను అందుకోవాలని భావిస్తున్నానని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.నయనతార ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని విఘ్నేష్ అన్నారు.నయనతారను చూసి నేను మాత్రమే కాదని కుటుంబమంతా సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు.
నయన్ విఘ్నేష్ కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.విఘ్నేష్ శివన్ తో పోల్చి చూస్తే నయనతార సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే.నయన్ విఘ్నేష్ లను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.నయనతార సోషల్ మీడియాలో క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.రాబోయే రోజుల్లో నయనతార బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టించనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నయన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.