రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District)ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మంగళవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని లీడర్ కాదన్నందుకు మంత్రి కేటీఆర్( KTR ) దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర పేరిట 5400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి భావి భారత ప్రధాన మంత్రిగా ప్రజలలో పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ కు తగదన్నారు రైతు వేదికల వద్ద రైతులకు ఏం న్యాయం చేశారని మాట్లాడుతున్నారని అన్నారు లక్ష రూపాయల రుణమాఫీ కాలేదని పంట నష్టపరిహారం ఇవ్వలేదని ఎరువులపై సబ్సిడీ ఇవ్వలేదని అన్నారు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం కూడా ఒక అబద్ధమని తేలిపోయిందన్నారు.
రైతుల( Farmers ) కోసం శ్రమించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అధికారంలోకి రాగానే రైతులకు కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శులు లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ కే సాహెబ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ,నాయకులు చెన్ని బాబు, గంట బుచ్చా గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, కొత్తపెళ్లి దేవయ్య, తిరుపతి గౌడ్, దేవచంద్రం, రోడ్డ రామచంద్రం, తిరుపతిరెడ్డి, రామస్వామి, ఎండి ఇమామ్,ల
.






