తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అలియా భట్( Alia bhatt ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో అందం అభినయం కలగలసిన హీరోయిన్ లలో అలియా భట్ కూడా ఒకరు.
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అలియా భట్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా భారీగా డబ్బులు సంపాదిస్తోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తోంది.ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తల్లి అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి అడుగుపెడుతోంది.
పాప పుట్టిన తర్వాత అలియా నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.రణ్ వీర్ సింగ్( Ranveer Singh ) సరసన అలియా నటించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమా తర్వలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా అలియా భట్ చేసిన పనికి నెటిజన్స్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా అలియా ముంభై( Mumbai )లోని ఒక ఏరియాకు వచ్చింది.అక్కడ ఆమెను ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహం చూపించారు.
అయితే అలియా వారికి కొన్ని ఫోటోస్ ఇచ్చింది.ఈ క్రమంలో ఫోటోస్ తీసే కంగారు ఒక ఫోటోగ్రాఫర్ చెప్పు కాలు నుంచి విడిపోయి పడింది.
అయితే అది గమనించిన అలియా ఆ చెప్పు ఎవరిది అంటూ అడుగుతూ.తన చేతితో పట్టుకుని సదరు వ్యక్తికి ఇచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అలియా చేసిన పనికి నెటిజన్స్ పొగడ్తలు కురిపిస్తున్నారు.
అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి అలా చెప్పుని చేతపట్టుకొని కెమెరామెన్ కు ఇవ్వడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ కొనియాడుతున్నారు.







