Monica Bedi : ఆ డైరెక్టర్ పిలిచినప్పుడు వెళ్ళుంటే బాగుండేది.. తప్పు చేశాను: స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది సహజం.కానీ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

 Actress Monica Bedi Feeling Guilty For Past Incident-TeluguStop.com

అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువే అన్న ఆరోపణలు చేసే హీరోయిన్స్ ని మనం రెగ్యులర్ గా చూస్తేనే ఉంటాం.ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి స్పందించిన విషయం తెలిసిందే.

కొంతమంది ఈ హీరోయిన్లు తప్పక మనసు ఒప్పక కమిట్మెంట్ ఇవ్వగా మరి కొంతమంది కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక అవకాశాలను కూడా వదులుకున్న వారు చాలామంది ఉన్నారు.

Telugu Bollywood, Monica Bedi, Soggadi Pellam-Movie

అయితే ఒక హీరోయిన్ మాత్రం డైరెక్టర్ పిలిస్తే వెళ్లలేదట.అంతేకాదు వెళ్లకుండా తప్పు చేశానే అని బాధపడిందట.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.ఆ నటి మరెవరో కాదు అలనాటి నటి మోనికా బేడి.( monica bedi ) తాజ్ మహల్ సినిమాతో వెండితెరకు పరిచయమైన మోనికా బేడి స్పీడ్ డాన్సర్, సోగ్గాడి పెళ్ళాం, శివయ్య, చూడాలనివుంది, సర్కస్ సత్తిపండు,( Circus Satti Pandu ) వంటి తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.1995 లో వచ్చిన సురక్ష అనే చిత్రంతో బాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుసగా సినిమాలతో బిజీ కావడంతో అక్కడే ఉండిపోయింది నటి మోనికా.

Telugu Bollywood, Monica Bedi, Soggadi Pellam-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.ఈ సందర్భంగా నటి మోనికా మాట్లాడుతూ డైరెక్టర్ సుభాష్ ఘై హోళీ పార్టీలో రాకేష్ రోషన్ ( Rakesh Roshan )నా దగ్గరకు వచ్చాడు.అతడు నాకు నటుడిగానే తెలుసు.

డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్న విషయం మాత్రం తెలియదు.అతడు కాసేపు మౌనంగా ఉండి నా వైపు చూస్తున్నాడు.

కాసేపు ఆగి నా దగ్గరికి వచ్చి చేతిలో విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి రేపే నున్ను వచ్చి కలువు అని చెప్పాడు.నాకు ఏం అర్థం కాలేదు.

ఇతడు నన్ను ఎందుకు పిలిచాడో అని అనుమానించి విజిటింగ్ కార్డ్ ను ముక్కలు ముక్కలు చేశాను.కొన్ని నెలల తర్వాత నా మేనేజర్.

మేడం మీరు ఎందుకు రాకేష్ ను కలవలేదు అని అడిగాడు.అతడు కరన్ అర్జున్ సినిమా తీస్తున్నాడు.

అందులో మీకు హీరోయిన్ పాత్ర ఇవ్వాలి అనుకున్నారు.సల్మాన్ ఖాన్ జోడిగా మమతా కులకర్ణి చేసిన క్యారెక్టర్ మీకు ఇద్దామని అనుకున్నాడు అని చెప్పాడు.

అప్పుడు కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు.డైరెక్టర్ రాకేష్ రోషన్ పిలిచినప్పుడు వెళ్లి ఉంటే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చేదని, మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాను అని బాధపడిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube