ఫ్రిజ్ కొంటే స్మార్ట్‌వాచ్ ఫ్రీ.. ఆ కంపెనీ బంపర్ ఆఫర్

షాపింగ్ మాల్స్ సేల్స్ పెంచుకునేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.కొన్ని రకాల ప్రోడక్ట్స్‌పై భారీ తగ్గింపును ఇస్తూ ఉంటాయి.

 Reliance Digital Begins Digital India Sale Buy Fridge And Get Smartwatch For Fre-TeluguStop.com

బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఎక్చేంజ్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.అందులో భాగంగా తాజాగా రిలయన్స్ డిజిటల్( Reliance Digital ) కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది.

ఒక ప్రోడక్ట్ కొంటే కొన్ని వస్తువులను ఫ్రీగా ఇవ్వనుంది.అవేంటో చూద్దాం.

ఇండియా సేల్( India Sale ) పేరుతో రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లను ప్రకటించింది.ఈ సేల్‌తో క్రెడిట్, డెబిట్ కార్డులపై భారీ డిస్కౌంట్స్ ఇవ్వనుంది.దాదాపు రూ.10 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.జులై 16 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మైజియో స్టోర్స్ లేదా రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ద్వారా ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేసి ఈ ఆఫర్లను పొందవచ్చు.

అలాగే కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇక ఈ సేల్‌లో భాగంగా ఒప్పో రెనో 10 ప్రో 5జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను ఆఫర్లపై రూ.39,999గా అందించనుంది.అలాగే శాంసగ్ గెలాక్సీ ఎస్‌23 అల్‌ట్రా ఫోన్‌ను రూ.1,06,999కే ఇవ్వనుంది.ఇక ఫ్రిజ్( Refrigirator ) కొంటే రూ.7,990 ధర కలిగిన స్మార్ట్‌వాచ్, వాషింగ్ మెషిన్ కొంటే రూ.3,850 ధర కలిగిన మిక్స్ గ్రౌండర్‌ను ఉచితంగా ఇవ్వనుంది.అంతేకాకుండా 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ టీవీని ఆఫర్‌లో రూ.46,990కే ఇవ్వనుంది.హెచ్‌పీ పెవిలియన్ 15 ల్యాప్‌టాప్ రూ.53,499కే అందించనుంది.ఇందులో ఇంటెల్ 12th జెన్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ తో పాటు 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube