యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం దేవర సినిమాతో( Devara ) బిజీగా ఉండగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన తారక్ ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో తారక్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్( Narne Nithin ) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో( Geetha Arts ) నార్నే నితిన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది.అయితే నార్నే నితిన్ సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో ఎక్కడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించడం లేదు.
నార్నే నితిన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి సపోర్ట్ లేదా అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అయితే నార్నే నితిన్ కు బహిరంగంగా కాకపోయినా వ్యక్తిగతంగా తన వంతు సపోర్ట్ లభిస్తోందని తెలుస్తోంది.ఎలా నటించాలో, కెరీర్ పరంగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలో ఎన్టీఆర్ తన వంతు సూచనలు చేశారని భోగట్టా.నార్నే నితిన్ మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకునేలా తారక్ నుంచి పూర్తిస్థాయిలో సహకారం లభిస్తోందని సమాచారం.
నార్నే నితిన్ తన నటనతో ప్రూవ్ చేసుకుంటే బహిరంగంగానే ఎన్టీఅర్ సపోర్ట్( NTR Support ) లభించే అవకాశం అయితే ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ సైతం కెరీర్ తొలినాళ్లలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.నార్నే నితిన్ సినిమాలలో సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.నార్నె నితిన్ కు ఇప్పటికే యంగ్ టైగర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది.
ప్రాజెక్ట్ ల ఎంపికలో నార్నె నితిన్ జాగ్రత్త వహించాల్సి ఉంది.







