రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) నేడు తణుకులో ముగిసింది.ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైసీపీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ పై.
( CM Jagan ) మంత్రులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మరి ముఖ్యంగా తణుకు ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు( Karumuri Nageswara Rao ) రైతులను ఉద్దేశించి అప్పట్లో ఎర్రిపప్ప అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
అన్నం పెట్టే రైతుని ఎర్రి పప్ప అంటూ దాన్ని.కవర్ చేసుకోవడానికి నానా బుజ్జి కన్నా అని అంటారా అంటూ మండిపడ్డారు.అన్నం పెట్టే రైతులను ఏ రకంగా విమర్శిస్తారు అని పవన్ సీరియస్ అయ్యారు.

మీది ఒక ఎర్రిపప్ప ప్రభుత్వం.మంత్రులు కూడా ఎర్రి పప్పలు అంటూ వైసీపీ పై పవన్ ఆగ్రహించారు.అలాగే ఎర్రి పప్ప టాక్స్ లు వేసి ప్రజలను మోసం చేయొద్దు అంటూ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.అధికారంలోకి వచ్చాక మాట మార్చారు అని మండిపడ్డారు.మద్యపానం పై దాదాపు లక్ష 30 వేల కోట్లు.ఈ ప్రభుత్వం సంపాదించిందని ఆరోపణలు చేశారు.
ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి తర్వాత వాటిని సమర్ధించుకుంటూ జగన్ హిస్టీరియా రోగంతో బాధపడుతున్నాడు అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.







