బేబీ సినిమా చూడటానికి ఈ 5 కారణాలు చాలు !

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంత బారి బడ్జెట్ పెట్టిన కూడా కొన్ని సార్లు సినిమాలు బోల్తా పడుతున్నాయి.

 5 Reasons To Watch Baby Movie, Baby Movie, Baby Review, Anand Devarakonda, Tolly-TeluguStop.com

అలాగే చిన్న చిన్న బడ్జెట్ లో సినిమాలు తీసి ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.అందుకే ఏ సినిమాను కూడా తక్కువగా అంచనా వేయటానికి వీలు లేదు.

ఆలా అని పెద్ద హీరో అయినంత మాత్రాన హిట్ అవుతుంది అనుకుంటే కూడా పొరపాటే.ఆలా చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల్లో మరొక చిత్రం వచ్చి చేరింది.

Telugu Baby, Baby Review, Sai Rajesh, Tollywood-Telugu Top Posts

అదే ఆనంద్ దేవరకొండ( Anand devarakonda ) హీరో గా, యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య( Vaishnavi chaithanya ) హీరోయిన్ గా నటించిన బేబీ( Baby movie ) చిత్రం.ఈ సినిమా చాల చిన్న సినిమాగా వచ్చి నేటి శుక్రవారం థియేటర్ లలో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.మరి ఈ ఫీల్ గుడ్ సినిమా చూడటానికి ఖచ్చితంగా ఈ 5 కారణాలు ఉన్నాయ్.అవేంటో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 1) ఇప్పటి జెనరేషన్ వారికి ప్రేమ అంటే ఏంటో తెలియదు.

Telugu Baby, Baby Review, Sai Rajesh, Tollywood-Telugu Top Posts

ప్రేమకు అట్రాక్షన్ కి ఉన్న గ్యాప్ ఏంటో కూడా తెలియదు.కానీ బేబీ సినిమా చూస్తే పక్క ఒక క్లారిటీ వస్తుంది2) నిజమైన ప్రేమ ఉన్న అబ్బాయి, తన ప్రేమ కోసం ఎలాంటి పని చేయడానికి అయినా వెనుకాడడు.అది కూడా ఈ చిత్రం ద్వారా మరోసారి రుజువు అయ్యింది3) దర్శకుడు సాయి రాజేష్ ( Sai Rajesh )నిజమైన ప్రేమ ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది, డబ్బు కోసం మాత్రమే ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్నీ చాల చక్కగా చూపించాడు.4) ఇక అంతే కాదు.ఇప్పటి స్మార్ట్ ప్రపంచం లో బ్రతుకుతున్న పిల్లలకు ఏం కావలి ? పెద్దలు పిల్లలతో ఎలా మెలగాలి ? ఎలా వారిని ఒక సరైన మార్గం లో పెట్టాలి ? ఎంత కేర్ తీసుకోవాలి అనే విషయాన్నీ చూపించడం లో కూడా దర్శకుడు సక్సెస్ అయ్యాడు.5) ప్రేమ అనే ముసుగు వేసుకొని ఎలాంటి హద్దులు అయినా దాటే వారి గురించి కూడా చాల నిక్కచ్చిగా దర్శకుడు చూపించాడు.ఈ ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే చాల మంది యువతరంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.ఇక ఎందుకు ఆలస్యం.బేబీ సినిమాకు టికెట్ బుక్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube