బాలయ్యలా తను కూడా పాపులర్ కావాలనుకుంటున్న నాగార్జున...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాగార్జున( Nagarjuna ) ఒక స్టార్ హీరో ఆయన చాలా పాత్రల్లో నటించి మెప్పించారు…ఇక ఏం చేసినా చాలా స్పెషల్ గా ఉండాలనుకునే ఆయన ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు.మొదట్లో రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించి భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు మన్మధుడిగా పేరు దక్కించుకున్న నాగార్జున ఆరుపదుల వయసులో కూడా అంతే యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.

 Nagarjuna Wants To Become Popular Like Balakrishna , Nagarjuna , Balakrishna, T-TeluguStop.com
Telugu Balakrishna, Meeloevaru, Nagarjuna, Tollywood-Telugu Top Posts

ఒకవైపు రొమాంటిక్ చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించి.బుల్లితెరపై కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే మొదట మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 6 వరకు హోస్ట్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి నాగార్జున హోస్టుగా రారు.

ఆయన ఈసారి కంటెస్టెంట్ ల వల్ల విసిగిపోయారని.అందుకే ఇక బిగ్ బాస్ నిర్వహణ మొహం మీదే తాను ఇకపై బిగ్ బాస్ ( Bigg boss )కి హోస్ట్ గా వ్యవహరించినట్లు వార్తలు వినిపించాయి…అయితే మొన్నటి వరకు సీజన్ 7 కి కొత్త హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వినిపించగా.

 Nagarjuna Wants To Become Popular Like Balakrishna , Nagarjuna , Balakrishna, T-TeluguStop.com

అయితే ఇలాంటి సమయంలోనే తాజాగా నాగార్జున మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్టింగ్ చేయబోతున్నట్లు క్లారిటీ రావడంతో అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఇదే సమయంలో నాగార్జునను వారు ఏం చెప్పి ఒప్పించి ఉంటారు అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.

అంతేకాకుండా నాగార్జున తో షో నిర్వాహకులు ప్రోమోను కూడా షూట్ చేసిన నేపథ్యంలో ఇక అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.అయితే నాగార్జున ఇలా ఉన్నట్టుండి ఇలాంటినిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రస్తుతం ఆయన కొత్త సినిమా ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి.అంతే కాదు ఈసారి ఆయన సీజన్ 6 తో పోల్చుకుంటే సీజన్ 7 కి డబుల్ పారితోషకం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Telugu Balakrishna, Meeloevaru, Nagarjuna, Tollywood-Telugu Top Posts

అయితే నాగార్జున బిగ్ బాస్ షో చేయడానికి ఇంకో రిజన్ కూడా ఉంది అదేంటంటే ఇప్పటికే సీనియర్ హీరో అయిన బాలయ్య( Balakrishna ) అన్ స్టపబుల్ షో తో బాగా పాపులర్ అయ్యాడు.ప్రేక్షకుల కి దగ్గర అవ్వాలంటే సినిమాలకంటే షో ల వల్లే అది సాధ్యం అవుతుంది కాబట్టి తనుకూడ ఈ సీజన్ లో బాలయ్య మాదిరి ప్రేక్షకులకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు…అయితే నాగర్జున చేతిలో ఇదొక షో నే ఉండటం వల్ల దాన్ని వదులుకోలేక మళ్ళీ కమిట్ అయినట్టుగా తెలుస్తుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube