'ఆడవారి మాటలకు..అర్థాలే వేరులే' సినిమాని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..? ఇంత దురదృష్టం ఏక్కడ ఉండదేమో!

కొన్ని సినిమాలు ఒక ఏజ్ గ్రూప్ వాళ్లకు తెగ కనెక్ట్ అయిపోతుంటాయి, ఎన్నేళ్లు అయినా ఆ సినిమాలకు ఇంచు క్రేజ్ కూడా తగ్గదు.ఎందుకంటే ఆ సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలను అద్దంలో చూసుకున్నట్టుగా అనిపిస్తాది.

 Allu Arjun Missed Venkatesh Aadavari Matalaku Ardhale Verule Movie Details, Allu-TeluguStop.com

అలాంటి సినిమాలలో ఒకటి విక్టరీ వెంకటేష్( Venkatesh ) హీరో గా నటించిన ‘ఆడవారి మాటలకు.అర్థాలే వేరులే’( Aadavari Matalaku Ardhale Verule ) చిత్రం.

ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.అప్పట్లో ఈ సినిమా ప్రభాస్ మున్నా సినిమాతో పోటీ గా విడుదల అయ్యింది.

మున్నా చిత్రం ఫ్లాప్ అవ్వగా, ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది.ఆరోజుల్లోనే ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాధించింది.

ఈ చిత్రం లో తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం, అలాగే ప్రేయసి కోసం వెంట తిరిగి మరీ ప్రేమించడం ఇలాంటివన్నీ చూస్తే మన నిజ జీవితం లోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.

Telugu Allu Arjun, Dhanush, Selva Raghavan, Trisha, Munna, Nayanthara, Prabhas,

అందుకే ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిల్చింది. ‘7/జి బృందావన కాలనీ’ లాంటి సంచలనాత్మక చిత్రం తీసిన సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఇక్కడ సూపర్ హిట్ అయ్యాక , ఇదే సినిమాని తమిళం లో ధనుష్ తో చేసాడు.

అక్కడ త్రిష కి ( Trisha ) బదులుగా నయనతార నటించింది.అక్కడ కూడా బాగానే ఆడింది కానీ, తెలుగు లో హిట్ అయ్యినంత రేంజ్ లో అయితే హిట్ అవ్వలేదు.

వెంకటేష్ యాక్టింగ్ టాలెంట్ ని ధనుష్ మ్యాచ్ చెయ్యలేకపోయాడు.అయితే ఈ చిత్రాన్ని తొలుత వెంకటేష్ తో చెయ్యాలని అనుకోలేదట, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో( Allu Arjun ) చెయ్యాలనుకున్నాడట.

ఆయనకీ స్టోరీ వినిపించగా ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం నచ్చలేదట, దీనితో ఈ ప్రాజెక్ట్ ఆయన చేతుల్లో నుండి జారిపోయింది.ఇదే స్టోరీ ని కొన్ని రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ ని కలిసి వినిపించాడు సెల్వ రాఘవ.

Telugu Allu Arjun, Dhanush, Selva Raghavan, Trisha, Munna, Nayanthara, Prabhas,

ఇక్కడ కూడా అదే స్టోరీ రిపీట్ అయ్యింది, సెకండ్ హాఫ్ మొత్తం పూర్తి గా మార్చి, తన ఏజ్ గ్రూప్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చెయ్యమని చెప్పాడట.అలా చేసిన తర్వాత వెంకటేష్ కి కథ బాగా నచ్చింది , వెంటనే షూటింగ్ ప్రారంభమైంది, ఇక ఆ తర్వాతి హిస్టరీ మన అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఈ చిత్రం లోని కొన్ని పాటలు ఇప్పటికీ మన ఆడియన్స్ వింటూ ఉంటారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు, అంత అద్భుతమైన మ్యూజిక్ ని అందించాడు యువన్ శంకర్ రాజా.అలా అల్లు అర్జున్ చెయ్యాల్సిన ఈ సినిమాని వెంకటేష్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని షేక్ చేసేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube