కాంగ్రెస్ కు రేవంత్ గండం.. చిక్కులు తప్పవా ?

కర్నాటక ఎన్నికల విజయం తరువాత టి కాంగ్రెస్ లో జోష్ గట్టిగానే పెరిగింది.

వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని, అధికారం కూడా హస్తం పార్టీదే అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.

అందుకు తగ్గట్టుగానే వ్యూహరచనతో నిత్యం హస్తం పార్టీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.ప్రస్తుతం బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Telangana Congress ) ప్రభావమే గట్టిగా ఉంది.

ఈ నేపథ్యంలో ఏ తప్పటడుగు వేసిన హస్తం పార్టీకి డ్యామేజ్ గట్టిగానే జరుగుతుంది.ఇటీవల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దూకుడుకి కాస్త బ్రేక్ వేసినట్లుగానే కనిపిస్తోంది.

బి‌ఆర్‌ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తాను ఇరకాటంలో చిక్కుకున్నారు రేవంత్ రెడ్డి.రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదని, మూడు గంటల కరెంట్ చాలని.ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్ది.

Advertisement

ఈ వ్యాఖ్యలను బి‌ఆర్‌ఎస్ నేతలు( BRS ) ఘాటైన విమర్శనస్త్రాలుగా వాడుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ రైతుల ద్రోహి పార్టీ అని, రైతులకు మంచి జరగడం హస్తం పార్టీ నేతలకు ఇష్టం లేదని.

ఇలా రకరకాల విమర్శలతో కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నేడుతున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు.దీంతో నిన్న మొన్నటి వరకు కాస్త దూకుడుగా వ్యవహరించిన హస్తం పార్టీ.

ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను కవర్ చేసుకునే పనిలో పడింది.

ఎన్నికల్లో ఏ పార్టీ విజయనికైనా రైతుల ఓటు బ్యాంక్( Farmers Votes ) చాలా కీలకం.అందుకే ప్రతి ఒక్క రాజకీయ నేత ముందు రైతులకు ఫేవర్ గా ఉండే హామీలనే ప్రకటిస్తూ ఉంటాడు.రైతులు కూడా తమకు అనుకూలంగా హామీలిచ్చే పార్టీల వైపే మొగ్గు చూపుతుంటారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఈ నేపథ్యంలో రైతులకు ఉచిత కరెంట్ అవసరం లేదనే విధంగా రేవంత్ రెడ్ది వ్యాఖ్యానించడం.కాంగ్రెస్ పార్టీకి రైతులను దూరం చేయడమే అవుతుందనేది కొందరి అభిప్రాయం.దీంతో హస్తం పార్టీ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎలా కవర్ చేసుకోవలో అర్థంకాని పరిస్థితిలో ఉంది.

Advertisement

మొత్తానికి అధికారమే లక్ష్యంగా తెలంగాణలో అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్ది చేసిన వ్యాఖ్యలు కొత్త చిక్కులనే తెచ్చిపెట్టాయి.మరి తలనొప్పి నుంచి హస్తం పార్టీ ఎలా బయట పడుతుందో చూడాలి.

తాజా వార్తలు