పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )ప్రధాన పాత్ర ల్లో రూపొందిన మూవీ బ్రో.ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.
ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా జోరుగా ప్రారంభం కాలేదు.పవన్ కళ్యాణ్ సినిమా అంటూ అభిమానులు తెగ చంకలు గుద్దుకుంటూ వెయిట్ చేస్తున్నారు.

కానీ సినిమా ను చూసిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )సినిమా ఎలా అవుతుంది బ్రో అంటూ మేకర్స్ పై విమర్శలు గుప్పించే అవకాశం ఉందట.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.బ్రో మేకర్స్ ఈ విషయాన్ని ముందు నుంచే అభిమానులకు చెప్తే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాన్ స్క్రీన్ స్పేస్ 50 నిమిషాల లోపే.
ఎక్కువగా సాయి ధరమ్‌తేజ్ కనిపిస్తాడట.కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కి వెళ్లి తమ అభిమాన హీరో ఎక్కువ లేడు.ఆయన సినిమా అని వస్తే ఇలా అయ్యిందేంటి…

ఆయన మార్క్ ఫైటింగ్స్ ఎక్కడ… రొమాన్స్ ఎక్కడ అంటే మాత్రం కచ్చితంగా ఉండవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మూవీ లో ఉన్న పవన్ కళ్యాణ్ ను ఓపెన్ మైండ్ తో చూస్తే తప్పకుండా నచ్చుతాడు.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ను విభిన్నమైన పాత్ర లో చూస్తున్నాం అని అనుకుంటే తప్పకుండా నచ్చుతుంది అంటూ యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు చెబితే బాగుంటుంది.ఇది పవన్ కళ్యాణ్ సినిమా అంటూ ప్రచారం చేయడం వల్ల ఆ తర్వాత డ్యామేజీ భారీగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
మొత్తానికి బ్రో మూవీ( Bro movie ) విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.







