జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వైసీపీపై మరింత ఘాటుగా విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.పవన్ చేసే కామెంట్ల విషయంలో కొంతమంది ఆయనను సమర్థిస్తుండగా మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం.
వారాహి యాత్ర2( Varahi Yatra2 ) లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణిని ఎప్పుడూ వివాదాల్లోకి లాగలేదని పవన్ అన్నారు.
తాడేపల్లిగూడెంలో( Tadepalligudem ) జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ 2019 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం రోజున జగన్ నుంచి ఆహ్వానం అందిందని ఆరోజు రాలేనని చెప్పానని ఆయన తెలిపారు.
జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని జగన్ భార్యను వివాదాల్లోకి లాగలేదని ఆయన పేర్కొన్నారు.సీఎం జగన్( CM Jagan ) కు సంస్కారం లేదని ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని పవన్ చెప్పుకొచ్చారు.

ఏపీ డేటా మొత్తం నానక్ రామ్ గూడలో ఉందని అక్కడి ఏజెన్సీలో పని చేస్తున్న 700 మందికి ఎవరు జీతాలు ఇస్తున్నారని పవన్ కామెంట్లు చేశారు.ఆడపిల్లలు లొంగని పక్షంలో పథకాలు తొలగిస్తామని వాలంటీర్లు భయపెడుతున్నారని పవన్ వెల్లడించారు.వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ ప్రశ్నించారు.వాలంటీర్ల జీతం భూమ్ భూమ్ కు ఎక్కువని ఆంధ్రాగోల్డ్ కు తక్కువని చెబుతూ పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జగన్ సరిగ్గా చదువుకోలేదు కాబట్టి వాలంటీర్ అంటే ఏంటో తెలియదని ఉపాధి లేకపోతే యువత ఎక్కడికి వెళ్తారని ఆయన అన్నారు.నేను సినిమాల్లో ఉంటే ఏడాదికి 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం వస్తాయని పవన్ పేర్కొన్నారు.2024 ఎన్నికల తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.







