గృహిణుల కష్టాలు, శ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకవైపు ఇంటి పనులు చూసుకుంటూనే.
మరోవైపు పిల్లల అలనాపాలన, భర్త పట్ల ప్రేమను చూపించాల్సి ఉంటుంది.ఇలా ఎన్నో రకాల పనులతో క్షణం కూడా తీరిక లేకుండా మహిళలు గడుపుతారు.
ఇక ఆఫీస్ కి వెళ్లే మహిళలు అయితే.ఆఫీస్ పనులతో పాటు ఇంటికొచ్చిన తర్వాత వంట పనులు, పిల్లల బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది.
తాజాగా ఒక మహిళ వీడియో వైరల్( Social media ) అవుతోంది.

ఒక మహిళ పిల్లలను పోషించేందుకు బతుకుబండిని నడుపుతుంది. తన బిడ్డకు మూడు పూటలా ఆహారం అందించేందుకు మూడు చక్రాల ఆటో రిక్షా( Auto rickshaw )ను నడుపుతుంది.ఒక చేతిలో స్టీరింగ్ పట్టుకుని ఆటో నడుపుతూ.
మరో చేతిలో బిడ్డను పట్టుకుంది.వైరల్ భయాని అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియో అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.బిడ్డను పోషించేందుకు తల్లి పడుతున్న కష్టం అందరిని కంటతడి పెట్టిస్తుంది.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒక మహిళ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని రిక్షా నడుపుతున్నట్లు వీడియోలో ఉంది.రిక్షాలో ప్రయాణికులు కూడా ఉన్నారు.ఈ మహిళ ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు.
తన బిడ్డను బాగా చూసుకునేందుకు ఈ తల్లి సాహాసమే చేస్తుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.తల్లి ప్రేమ( Mother ) ముందు ఎవరి ప్రేమ సరిపోదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇలా డ్రైవ్ చేయడం ప్రమాదకరమని, అదుపు తప్పితే పాప పడిపోయే ప్రమాదం ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఇక అమ్మ ప్రేమకు వెల కట్టలేమని మరికొందరు ఎమోషనల్ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు.
కుటుంబాన్ని పోషించే బాధ్యత ఈ మహిళ మీద వేశారని మరికొందరు అంటున్నారు.







