ఆర్టీసీ బస్సుల్లో కొంతమంది తోటి ప్రయాణికులు.కండక్టర్, డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం.
కండక్టర్ పై దాడి చేయడం, దురుసుగా ప్రవర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి.ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారుతూ ఉంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఒక కండక్టర్ పట్ల ఆర్టీసీ బస్సులో ఓ మహిళ దరుసుగా ప్రవర్తించింది.
కండక్టర్ ను వ్యక్తిగతంగా దుర్బాషలాడింది.

ఒక ముస్లిం కండక్టర్ పై ఓ మహిళ ఆర్టీసీ బస్సులో దురుసుగా ప్రవర్తించిన ఘటన బెంగళూరు( Bengaluru )లో చోటుచేసుకుంది.ఒక ముస్లిం కండక్టర్ ఆర్టీసీ బస్సులో ముస్లింలు ధరించే వైట్ టోపీ పెట్టుకుని కనిపించాడు.దీంతో సదరు కండక్టర్ పై మహిళ మితిమీరి ప్రవర్తించింది.
డ్యూటీలో ఉన్నప్పుడు టోపీ ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించింది.మసీదు( Mosque )లో లేదా ఇంట్లో పెట్టుకోవాలని, డ్యూటీలో ఉండి బస్సులో పెట్టుకోవడం కాదని ప్రశ్నించింది.
టోపీ తీసేయాల్సిందిగా కండక్టర్ ను బలవంతపెట్టింది.

బెంగళూరులో కండక్టర్ తో మహిళ అమర్యాదగా ప్రవర్తించడంతో కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.దీంతో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో ముస్లిం ఆర్టీసీ కండక్టర్ పై ఓ మహిళ ఎలా పడితే అలా దుర్బాషలాడుతూ కనిపించింది.
కొంతమంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు.కానీ మహిళ మాత్రం అవేమీ పట్టించుకోకుండా కండక్టర్ ను టార్గెట్ చేసింది.
డ్యూటీలో ఉన్న సమయంలో టోపీ ఎందుకు ధరించావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.మహిళ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.
టోపీ ధరిస్తే మహిళకు వచ్చిన ఇబ్బందేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇలా కించపర్చడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.







