ఆ హీరో ఫ్యాన్స్ ఓపిక నశించింది... ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ ( Yash )కేజీఎఫ్ రెండు భాగాలు ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకున్నాయో అందరికి తెల్సిందే.అందుకే ఆయన నుండి కొత్త సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

 Kgf Star Yash Next Film Fans Angry ,yash, Kgf Movie, Kgf 2, Nidhi Shetty, Boll-TeluguStop.com

కేజీఎఫ్ సినిమా కి ముందు యశ్‌ తదుపరి సినిమా ల కోసం కేవలం కన్నడ ప్రేక్షకులు అది కూడా కొందరు ఆయన అభిమానులు ఎదురు చూసే వారేమో.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ స్టార్‌ యశ్‌ సినిమా ల కోసం వెయిట్‌ చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా యశ్‌ కి ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఆయన తదుపరి సినిమా ల పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా తన తదుపరి సినిమా ఉండాలని యశ్ ప్లాన్‌ చేస్తున్నాడు.అందులో భాగంగానే యశ్‌ కొత్త కథ లు వింటున్నాడు.దాదాపు ఏడాది కాలంగా యశ్ సినిమా గురించి చర్చ జరుగుతోంది.కానీ ఇప్పటి వరకు కన్ఫర్మ్‌ అవ్వలేదు.అభిమానులు ఒకానొక సమయంలో అసహనానికి గురి అవుతున్నారు.సోషల్ మీడియా( Social media ) లో యశ్ సినిమా ల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా యశ్‌ ఒక ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరు అయిన సమయంలో ఎప్పుడు సినిమా వస్తుంది అంటూ ప్రశ్నించారు.

ఆ సమయంలో అభిమానులు కాస్త వైల్డ్‌ గా రియాక్ట్‌ అవ్వడంతో యశ్‌ అభిమానులకు సమాధానం చెప్పడం లో కష్టపడ్డాడు.కచ్చితంగా కేజీఎఫ్( Kgf ) రేంజ్ లో సినిమా ఉంటుందని.అందుకోసం వెయిట్‌ చేస్తున్నాను.

వచ్చే కాలంలో ముందు ముందు తన అభిమానులకు మంచి సినిమా ను ఇస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చాడు.కాస్త ఓపిక పట్టాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యశ్ వెంటనే ఏదో ఒక సినిమా కు కమిట్ అవ్వాలని అభిమానులు డిమాండ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube