నటి, దర్శకురాలు, నిర్మాతగా సినిమా రంగంలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న హేమామాలిని( Hema Malini ) ఇప్పుడు రాజకీయవేత్తగా కొనసాగుతున్నారు.1963లో ఆన్‌స్క్రీన్ డ్యాన్సర్‌గా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చాలా బ్లాక్‌బస్టర్ హిందీ సినిమాల్లో నటించి స్టార్డమ్ తెచ్చుకున్నారు.ప్రస్తుతం లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్న హేమా అందరు హీరోయిన్ల లాగానే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు.ఆమె సినీ కెరీర్ పూల బాటలా కొనసాగలేదు.సినీ ఇండస్ట్రీలో కామాంధుల వల్ల ఆమె నిద్రలేని రాత్రులు గడిపారు.ముఖ్యంగా ఒక డైరెక్టర్ ( Director ) అందరి ముందు ఆమెను అసభ్యంగా అడిగిన ఒక మాట ఇప్పటికీ ఆమెను వెంటాడుతోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమామాలిని ఆ దర్శకుడు తనను అందరి ముందు ఎలా నీచంగా మాట్లాడాడో తెలిపారు.ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .”నేను సినిమాలు చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నా.ఒకరోజు ఒక డైరెక్టర్ నాతో చాలా అసభ్యకరంగా మాట్లాడాడు.
నా సినీ కెరీర్ మొత్తంలో ఎదురైనా అతిపెద్ద చేదు అనుభవం అదే.అందుకే దాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా.ఆ దర్శకుడు పేరు బయటికి చెప్పదలుచుకోలేదు కానీ అసలు అది ఎలా జరిగిందో చెప్పాలనుకుంటున్నా.ఒక సినిమాలో ఆ దర్శకుడు నాపై రొమాంటిక్ సీన్ షూట్ చేయాల్సి ఉంది…”

“ఆ సీన్‌కి సంబంధించి అంతా సిద్ధం చేశారు.నేను అప్పుడు చీర కట్టుకొని ఉన్నాను.పైట జారిపోకుండా ఒక పిన్ పెట్టుకున్నాను.
అది గమనించిన సదరు డైరెక్టర్ ఆ పిన్ తీసేయమన్నారు.మొదట అతను ఎందుకలా అడుగుతున్నాడో నాకు అర్థం కాలేదు.
పిన్ తీసేస్తే పైట జారిపోతుంది కదా సార్ అని నేను అన్నాను.అప్పుడు నాకు కావాల్సింది కూడా అదే అంటూ అందరి ముందు అన్నాడు.
అతను ఏ ఉద్దేశంతో అలా అన్నాడో నాకు వెంటనే తెలిసింది.దాంతో చాలా బాధపడ్డాను.
అందరి ముందు అలా అనేసరికి చాలా భయం కూడా వేసింది.“ అని హేమామాలిని చెప్పుకొచ్చింది.
ఆమె కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఆమెతో అసభ్యంగా మాట్లాడింది ఒక అవార్డు విన్నింగ్ డైరెక్టర్( Award Winning Director ) అని ప్రచారం సాగుతోంది.







