జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) ఏలూరు నుండి ప్రారంభించారు.ఈ క్రమంలో ఏలూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇస్తూ జగన్ గారు.జగన్ మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) గారు సంబోధించడం జరిగింది.
అయితే ఏలూరు సభ నుండి ముఖ్యమంత్రిని ఏకవచనంతో నువ్వు అనే పిలుస్తా.జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని అన్నారు.
చాలా నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళించిందని కాగ్ నివేదిక ఇచ్చిందని ఆరోపించారు.దీనిలో భాగంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డబ్బులు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.

ఏలూరు పెద్ద ఆసుపత్రిలో సరైన వైద్యులు లేరని.వైద్యం సరిగ్గా అందటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.మద్యపాన నిషేధమని చెప్పి.ఇప్పుడు అదే మద్యపానంపై కొన్ని వేలకోట్లు ప్రభుత్వం రాబడుతుందని పేర్కొన్నారు.ఏలూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఏప్పటి నుండో ఉన్న సమస్య.ఈ విషయంలో అసలు ప్రభుత్వం చొరవ తీసుకోలేదని మండిపడ్డారు.
కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్ మూతపడిన ప్రభుత్వంలో కదలికలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వరదలు వస్తే ఏలూరు ( Eluru )మునిగిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఏలూరు కాలువకు రక్షణ గోడలు నిర్మించాలని ప్రజలు కొన్నేలుగా కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు.ఏలూరులో డిగ్రీ కాలేజీకి ఇప్పటివరకు సరైన భవనం లేదని అన్నారు.
నిమ్మ రైతులు పడుతున్న కష్టాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఏలూరు వారాహి సభలో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.







